Tollywood: ఈ టాలీవుడ్ నటుడికి 500 ఎకరాల భూమి.. లగ్జరీ మ్యాన్షన్ .. అన్నీ పోగొట్టుకుని ఇప్పుడిలా..
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది పుట్టుకతోనే కోటీ శ్వరులే. వారికి వారసత్వంగా వేలాది ఎకరాల భూములు, విలాసవంతమైన ఇళ్లు సొంతమయ్యాయి. ఈ టాలీవుడ్ నటుడికి కూడా అదే జరిగింది.. కానీ ఇప్పుడు అన్నింటినీ కోల్పోయాడు.

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. రోడ్డుపై తిరిగే వాడిని మేడలెక్కిస్తోంది. అలాగే మేడల్లో ఉండేవాడిని రోడ్డుపైకి లాగుతుంది. ఈ టాలీవుడ్ నటుడి జీవితం ఇందుకు పెద్ద ఉదాహరణ. ఈ టాలీవుడ్ కమెడియన్ కూడా కోట్లకు వారసుడు. ఒక పెద్ద భూస్వామి కుమారుడైన అతనికి కోట్లాది రూపాయల ఆస్తులుండేవి. అలాగే ఏకంగా 5 ఎకరాల్లో లగ్జరీ హౌస్ ఉండేది. వీటికి తోడుగా 500 ఎకరాల్లో విలువైన తోటలు, ఆస్తులు ఉండేవి. కానీ సినిమాల పిచ్చితో అన్నిటినీ కోల్పోయారు. ఎడాపెడా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. చివరకు ఈ నటుడి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ప్రస్తుతం తన సినిమాల ద్వారా వచ్చిన సంపాదనతోనే బతకు బండీని నడుపుతున్నాడు. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా? కోలీవుడ్ నటుడు, కమెడియన్ సత్యన్. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ శంకర్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘స్నేహితుడు’ సినిమాలో సైలెన్సర్ అంటే ఇట్టే గుర్త పడతారు. సత్యన్ ఇప్పుడు కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావొచ్చు. కానీ ఒకప్పుడు హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ క్లిక్ అవ్వలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు
సత్యన్ కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించాడు. నితిన్ భీష్మ సినిమాతో పాటు.. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాలోనూ సత్యన్ నటించాడు. అలాగే తెలుగు డబ్బింగ్ సినిమాలతోనూ టాలీవుడ్ ఆడియెన్స్ కు చేరువయ్యాడు.
కోలీవుడ్ నటుడు సత్యన్ ఫొటోలు..
View this post on Instagram
కాగా సత్యన్ ఒక పెద్ద భూస్వామి కుమారుడు. అఅతని తండ్రి మాధంపట్టి శివకుమార్ భూస్వామికి కొన్ని కోట్లు విలువజేసే ఆస్తులున్నాయి. ఇక ఈ మాధంపట్టి శివకుమార్ ఏకైక కుమారుడు సత్యన్. మాధంపట్టిలో వాళ్ల ఇల్లు ఏకంగా 5 ఎకరాల్లో విస్తరించింది ఉంది. ఇది కాకుండా.. వారికి 500 ఎకరాల్లో విలువైన తోటలు, ఆస్తులు ఉన్నాయి. అయితే మాధంపట్టి శివకుమార్‌కి సినిమాలంటే పిచ్చి. ఎడాపెడా సినిమాలను తీశాడు. కానీ ఏవీ సక్సెస్ అవ్వలేదు. దీంతో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక శివకుమార్ మరణం తర్వాత చెన్నైలో నే స్థిర పడ్డాడు సత్యన్. దీంతో మాధంపట్టిలోని తమ బంగ్లాను సైతం అమ్మేశారు. ఇప్పుడు తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








