AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సోషల్ మీడియాతో ఇంత దారుణమా? ఓటీటీలో సంచలనం రేపుతోన్నరియల్ స్టోరీ.. మస్ట్ వాచ్ థ్రిల్లర్

సోషల్ మీడియాలో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే అనర్థాలున్నాయి. దీని వల్ల కొందరి జీవితాలు మారిపోవచ్చు లేదా తారుమారు కావొచ్చు. ఇదే విషయాన్ని ఈ మూవీలో చక్కగా చూపించారు. క్లుప్తంగా చెప్పాలంటే.. ఒక మహిళకు సాయం చేద్దామని వెళ్లిన అన్నదమ్ములు చివరికి ఏమయ్యారన్నదే ఈ థ్రిల్లర్ మూవీ కథ.

OTT Movie: సోషల్ మీడియాతో ఇంత దారుణమా? ఓటీటీలో సంచలనం రేపుతోన్నరియల్ స్టోరీ.. మస్ట్ వాచ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 30, 2025 | 9:34 PM

Share

ఈ మధ్యన నిజ జీవిత సంఘటలను సినిమాల రూపంలోకి తీసుకువస్తున్నారు. సంచలనం సృష్టించిన సంఘటనలను సిల్వర్ స్క్రీన్ పై కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే. 2018లో అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ లించింగ్ లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక వాట్సాప్ వీడియో ద్వారా వ్యాపించిన ఒక తప్పుడు ప్రచారం వల్ల, ఇద్దరు అన్నదమ్ములు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? ఒక మహిళకు సాయం చేద్దామని వెళ్లిన వారికి చివరికి ఎలాంటి గతి పట్టిందన్నదే ఈ సినిమా కథ. గౌతమ్ బన్సాల్ అనే వ్యాపారవేత్త, తన తమ్ముడు రామన్ బన్సాల్ ని రిసీవ్ చేసుకోవడానికి రాజస్థాన్‌లోని ఒక చిన్న రైల్వే స్టేషన్‌కు వస్తాడు. రామన్ చాలా సెన్సిటివ్ అయితే గౌతమ్ మాత్రం కొంచెం సెల్ఫిష్. వీరు రైల్వే స్టేషన్ లో ఉండగానే చంపా అనే ఒక పేద మహిళకు చెందిన 5 నెలల బిడ్డను ఎవరో అపహరిస్తారు. ముందు రామన్, గౌతమ్ లనే అందరూ అనుమానిస్తారు. కానీ ఆ తర్వాత వేరొకరు పసి బిడ్డను కిడ్నాప్ చేశారని తెలుసుకుంటారు. ఈ విషయంలో రామన్ చంపాకు సహాయం చేయాలనుకుంటాడు. కానీ గౌతమ్ దీనికి ఏ మాత్రం ఇష్టపడడు. చివరకు రామన్, గౌతమ్‌ను ఒప్పించి, చంపాతో కలిసి తప్పి పోయిన శిశువును వెతకడానికి బయలు దేరుతారు.

అయితే ఈ ప్రయాణంలో వీరికి కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక WhatsApp వైరల్ వీడియో రామన్, గౌతమ్ లను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తుంది. ఎక్కడకు వెళ్లినా ఈ అన్నదమ్ములను చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. మరీ అసలు రామన్, గౌతమ్ లు చివరికి ఏమయ్యారు? చంపా తన కూతురును కలుసుకుందా? అసలు ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ థ్రిల్లర్ పేరు స్టోలెన్. ఓటీటీ సెన్సేషన్ అభిషేక్ బెనర్జీ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. కేవలం 1 గంట 33 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి ఐఎమ్‌డీబీలో 7.5/10 రేటింగ్ ఉంది. 2025 జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.