AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 35 లక్షల ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో ఏటా రూ. 1 కోటి సంపాదిస్తున్న కొత్త జంట!

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించే వేదికగా మారింది. దీనికి నిదర్శనమే ముస్కాన్, ఆశిష్ అనే దంపతుల విజయగాథ. సురక్షితమైన ఐటీ/టెక్ ఉద్యోగాలను వదిలిపెట్టి, తమకు ఇష్టమైన కంటెంట్ క్రియేషన్ రంగాన్ని ఎంచుకుని నేడు ఏడాదికి రూ. 1 కోటికి పైగా ఆర్జిస్తున్నారు. తమ సృజనాత్మకతతో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుని, ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ జంట విజయగాథ ఇప్పుడు చూద్దాం..

రూ. 35 లక్షల ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో ఏటా రూ. 1 కోటి సంపాదిస్తున్న  కొత్త జంట!
Youtube Success Story
Jyothi Gadda
|

Updated on: Aug 05, 2026 | 1:11 PM

Share

సురక్షితమైన, అధిక వేతనం వచ్చే ఐటీ లేదా టెక్ ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే ఎవరికైనా పెద్ద సాహసమే. కానీ, తమ కలల వెంటే పయనించాలనే బలమైన ఆకాంక్ష ఉంటే ఎలాంటి రిస్క్ అయినా చేయవచ్చని నిరూపించారు ముస్కాన్, ఆశిష్ అనే దంపతులు. రూ. 35 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగాలను వదిలి కంటెంట్ క్రియేషన్‌లోకి అడుగుపెట్టిన వీరు, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఏటా రూ. 1 కోటి ఆదాయం పొందే స్థాయికి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.

ముస్కాన్, ఆశిష్ ఇద్దరూ టెక్ పరిశ్రమలో మంచి హోదాలో పనిచేస్తూ చెరో రూ. 35 లక్షలకు పైగా వార్షిక వేతనాన్ని అందుకునేవారు. అయితే, నిత్యం ఒకే రకమైన రొటీన్ ఆఫీస్ జీవితం కంటే తమలోని సృజనాత్మకతకు పదును పెట్టాలని, ప్రపంచాన్ని చుట్టి రావాలని వారు నిర్ణయించుకున్నారు. ఐటీ ఉద్యోగాలు వదిలి కంటెంట్ క్రియేటర్‌గా మారతామని ఇంట్లో చెప్పినప్పుడు కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

ఇవి కూడా చదవండి

లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదిలేయడం పెద్ద రిస్క్ అని అందరూ హెచ్చరించారు. అయినప్పటికీ, తమ కలపై ఉన్న నమ్మకంతో ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. విజయవంతమైన కంటెంట్ క్రియేటర్లుగా.. ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ, ట్రావెల్, లైఫ్‌స్టైల్, కపుల్ వ్లాగ్స్ రూపంలో నాణ్యమైన కంటెంట్‌ను అందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్లను ఆకట్టుకోవడం ప్రారంభించారు.

విహారయాత్రలు, తమ రోజువారీ జీవితం, ప్రయాణ చిట్కాలను సరళమైన శైలిలో అందిస్తూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలాది మంది వీక్షకులను సొంతం చేసుకున్నారు. వీక్షకుల సంఖ్య పెరగడంతో ప్రముఖ బ్రాండ్లు వీరితో భాగస్వామ్యం వహించడానికి ముందుకు వచ్చాయి. కఠిన శ్రమ, క్రమశిక్షణతో ప్రస్తుతం వీరి వార్షిక ఆదాయం రూ. 1 కోటి సరిహద్దును దాటేసింది.

వీడియో ఇక్కడ చూడండి..

మన అభిరుచిని సరైన ప్రణాళికతో వ్యాపారంగా మలుచుకుంటే కార్పొరేట్ ఉద్యోగాల కంటే ఎక్కువ విజయాన్ని సాధించవచ్చు అని ఈ జంట రుజువు చేశారు. స్థిరమైన ఉద్యోగాలను వదులుకుని తమ కలల వెంటే పయనించి విజయం సాధించిన ముస్కాన్-ఆశిష్ కథ నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది