Watch: పిల్లను కాపాడుకోవడానికి నాగుపాముతో పోరాడిన తల్లి కోడి.. కానీ చివరకు ఇలా..
పామును చూస్తేనే మనుషుల గుండెలు గుబెలుమంటాయి. అలాంటిది ఒక మూగజీవి తన బిడ్డను కాపాడుకోవడానికి సాక్షాత్తూ కాలనాగుతోనే పోరాటానికి దిగింది. పిల్లను కాపాడుకోవడానికి ఒక తల్లి కోడి చేసిన వీరోచిత పోరాటం స్థానికులను కంటతడి పెట్టించడమే కాకుండా, భయాందోళనకు గురిచేసింది. ఈ కన్నీటి సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో వెలుగు చూసింది. తన పిల్లను కాపాడుకోవటానికి పాముతో పారాడిన తల్లి కోడి చివరకు ఓడిపోయింది. అసలు ఏం జరిగిందంటే..

రామగుండం పట్టణానికి చెందిన ఒక కుటుంబం తమ ఇంట్లో కోళ్లను పెంచుకుంటున్నారు. వాటి నివాసం కోసం ఒక మట్టి కుండతో గూడును ఏర్పాటు చేశారు. అయితే, ఆకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడిన ఒక పెద్ద నాగుపాము ఆహారం కోసం కోళ్ల గూడు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గూడులో ఉన్న కోడిపిల్లను కాలనాగు కాటువేసింది. తన కళ్ల ముందే పిల్ల ప్రాణాలు కోల్పోతుండటం చూసిన తల్లి కోడి తట్టుకోలేకపోయింది. కాలనాగు అని కూడా చూడకుండా ఆ నాగుపాముపైకి లంఘించింది. పామును ముప్పుతిప్పలు పెడుతూ పలుమార్లు దానిపై దాడి చేసింది. కానీ, పడగవిప్పి బుసలు కొట్టిన ఆ నాగుపాము విషకోరలకు చివరకు ఆ తల్లి కోడి కూడా బలైపోయింది. తల్లి కోడి, దాని పిల్ల రెండూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి.
ఉదయాన్నే కోళ్లకు దాణా వేసేందుకు గూడు వద్దకు వెళ్లిన యజమానులు కుండలో పడగవిప్పి ఉన్న కాలనాగును, చనిపోయి ఉన్న కోళ్లను చూసి తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే చుట్టుపక్కల వారికి విషయం తెలియజేశారు. స్థానికుల సమాచారంతో ప్రముఖ స్నేక్ క్యాచర్ నవీద్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. కుండలో దాక్కుని ఉన్న నాగుపామును ఎంతో చాకచక్యంగా పట్టుకుని, ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో బంధించాడు. ఆ తర్వాత దానిని జనావాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టాడు. పామును పట్టుకోవడంతో ఇంటి సభ్యులు, చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బిడ్డ కోసం నాగుపాముతో పోరాడిన ఆ తల్లి కోడి ప్రేమను చూసి స్థానికులు కలచివేతకు గురయ్యారు.




