AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తగా కొన్న బంగారం, వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటో తెలుసా..? అసలు రహస్యం ఇదేనట!

కొత్తగా బంగారం లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు బంగారం వ్యాపారులు వాటిని గులాబీ లేదా ఎరుపు రంగు కాగితంలో చుట్టి ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఇది కేవలం ఒక ఆచారం లేదా అలంకరణ మాత్రమే కాదు. దీని వెనుక శాస్త్రీయ, జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. బంగారం మెరుపు తగ్గడం వంటివి జరగకుండా ఈ పేపర్ నిరోధిస్తుంది. అలాగే జ్యోతిష్య పరంగా ఉన్న కారణాలు, వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం..

కొత్తగా కొన్న బంగారం, వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటో తెలుసా..? అసలు రహస్యం ఇదేనట!
Why Gold Is Wrapped In Pink PaperImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Aug 05, 2026 | 8:23 AM

Share

మనం జ్యువెలరీ షాప్‌కి వెళ్లి బంగారం లేదా వెండి ఆభరణాలు, నాణాలు కొనుగోలు చేసినప్పుడు వ్యాపారులు వాటిని ఎరుపు లేదా గులాబీ రంగు కాగితంలో జాగ్రత్తగా చుట్టి ఇస్తుంటారు. చాలామంది ఇది కేవలం ఒక ప్యాకింగ్ స్టైల్ లేదా సాంప్రదాయం అని అనుకుంటారు. కానీ, దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలతో పాటు జ్యోతిష్య ప్రాముఖ్యత కూడా దాగి ఉందనే విషయం చాలామందికి తెలియదు.

శాస్త్రీయ కారణాలు..

తేమ, గాలి నుంచి రక్షణ: వెండి, బంగారు ఆభరణాలు గాలిలోని ఆక్సిజన్, సల్ఫర్, తేమతో చర్య జరిపినప్పుడు వాటి రంగు మారుతుంది. ముఖ్యంగా వెండి త్వరగా నల్లబడుతుంది. అలాగే, బంగారం తన సహజ మెరుపును కోల్పోతుంది. గులాబీ రంగు గ్రీజ్‌ప్రూఫ్/యాంటీ-టార్నిష్ కాగితం బయటి తేమను పీల్చుకోకుండా ఆభరణాలకు శ్రీరామరక్షగా నిలుస్తుంది.

స్క్రాచెస్ పడకుండా: బంగారం చాలా మృదువైన లోహం. ఇతర వస్తువులు తగిలితే దానికి గీతలు పడే అవకాశం ఉంది. మృదువైన ఈ గులాబీ టిష్యూ పేపర్‌లో చుట్టడం వల్ల ఆభరణాలు ఒకదానికొకటి రాపిడికి గురికాకుండా సురక్షితంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

జ్యోతిష్య, ఆధ్యాత్మిక కారణం:

లక్ష్మీదేవి అనుగ్రహం: హిందూ సాంప్రదాయంలో గులాబీ, ఎరుపు రంగులను ఐశ్వర్యానికి, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. గులాబీ రంగు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ రంగు కాగితంలో బంగారం ఉంచడం వల్ల ఇంట్లో ధనలాభం పెరుగుతుందని నమ్ముతారు.

శుక్ర, అంగారక గ్రహాల శుభ దృష్టి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం గురు, సూర్య గ్రహాలకు, గులాబీ రంగు శుక్ర గ్రహానికి సంకేతం. ఇవి రెండూ కలిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, శోభ పెరుగుతాయని విశ్వసిస్తారు.

కస్టమర్ సైకాలజీ, వ్యాపార రహస్యం:

కాంతివంతమైన గులాబీ లేదా ఎరుపు రంగు కాగితం వెనుక బంగారం లేదా వెండి ఆభరణాలను ఉంచినప్పుడు, ఆ రంగుల కాంతి పరావర్తనం వల్ల బంగారం మరింత పసుపు పచ్చగా, వెండి మరింత తళతళలాడుతూ మెరుస్తూ కనిపిస్తుంది. ఇది కస్టమర్ల కళ్లకు ఆభరణాన్ని మరింత ఆకర్షణీయంగా చూపుతుంది. ఈ సాంప్రదాయ, శాస్త్రీయ కారణాల వల్లే శతాబ్దాలుగా బంగారం వ్యాపారులు ఆభరణాలను గులాబీ కాగితంలో చుట్టి ఇచ్చే పద్ధతిని కొనసాగిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే
డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు
డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ
భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు
భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు
లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!
వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!
ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది
ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది
జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!
జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్