AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 22 ఏళ్లుగా సినిమాల్లో.. అమ్మాయిల ఫేవరెట్ హీరో.. కానీ సొంత ఇల్లు కూడా లేదట.. ఎవరో తెలుసా?

2003లో హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 25కు పైగా సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిశాడు. క్రేజీ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పటివరకు ఈ క్రేజీ హీరోకు సొంతంగా ఒక్క ఇల్లు కూడా లేదట.

Tollywood: 22 ఏళ్లుగా సినిమాల్లో.. అమ్మాయిల ఫేవరెట్ హీరో.. కానీ సొంత ఇల్లు కూడా లేదట.. ఎవరో తెలుసా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jun 29, 2025 | 7:55 PM

Share

సాధారణంగా సినిమా సెలబ్రిటీలంటే పెద్ద పెద్ద భవనాల్లో ఉంటారనుకుంటారు చాలా మంది. అలాగే లగ్జరీ కార్లలో తిరుగుతుంటారనుకుంటారు. ఇక పార్టీలు, ఫంక్షన్లు అంటూ నిత్యం విందులు, వినోదాల్లో మునిగితేలుతుంటారని అభిప్రాయపడుతుంటారు. అయితే అందరి జీవితం ఒకేలా ఉండదన్నట్లు ఈ టాలీవుడ్ హీరోకు కనీసం సొంత ఇల్లు కూడా లేదట. 25 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క ప్రాపర్టీ కూడా కొనుక్కోలేదట. అయితే ఇటీవలే పెళ్లి చేసుకోవడంతో సొంతిల్లు కొనుక్కున్నానంటున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? అతను మరెవరో కాదు ఒకప్పటి లవర్ బాయ్, హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్. తమిళ్, తెలుగులో అనేక సినిమాల్లో నటించి హిట్స్ కొట్టిన ఈ హీరో ఒకప్పుడు ఓ రేంజ్ లో వెలిగాడు. అమ్మాయిలకు ఫేవరెట్ హీరో అయిపోయాడు. కానీ ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించడంతో కాస్త వెనక బడ్డాడు. అయినా తన ప్రయత్నాలు ఆపడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాయి.

సిద్దార్థ్ నటించిన 3BHK సినిమా జులై 4 రిలీజ్ కానుంది. ఈ సినిమా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కల అనే కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సిద్దార్థ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి మాట్లాడాడు. ఇదే సందర్భంగా తన సొంతింటి గురించి మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

‘ నేను సినిమా పరిశ్రమకు వచ్చి సుమారు 25 ఏళ్ళు అయింది. నా సగం జీవితం సినిమాల్లోనే గడిపాను. కానీ నేను ఇప్పటివరకు ఒక్క ప్రాపర్టీ కూడా కొనుక్కోలేదు. నాకు సొంత ఇల్లు, ల్యాండ్ లాంటివీ ఏమీ లేవు. అయితే ఇటీవలే నాకు పెళ్లి అయి బాధ్యతలు పెరిగాయి అందుకే రెండు నెలల క్రితమే ఒక సొంతిల్లు కొనుక్కున్నాను. అది కూడా నాకు, అదితికి కామన్ గా ఉన్న డ్రీం హౌస్. మా ఇద్దరికి ఒక ఇల్లు ఉండాలని ఆశపడి కొనుక్కున్నాం. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను, ఇల్లు ఎప్పుడు కొంటాను అని మా పేరెంట్స్ ఎదురుచూసేవారు. ఇప్పుడు వాళ్ల కోరికలు తీరాయి’ అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. కాగా కొన్ని నెలల క్రితం హీరోయిన్ అదితి రావు హైదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..