AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు HYDలో స్వీట్స్ అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరో కమ్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

టాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ ట్యాలెంటెడ్ పర్సన్స్‌లో ఈయన కూడా ఒకరు. నటుడిగా, డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా.. ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటారాయన. తన ప్రతిభకు ప్రతీకగా ఏకంగా మూడు నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు.

Tollywood: ఒకప్పుడు HYDలో స్వీట్స్ అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరో కమ్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Director
Basha Shek
|

Updated on: Jun 27, 2025 | 9:07 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. హీరోగా, డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా.. ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో పుట్టాడు. భీమవరంలో పీజీ పూర్తి చేశాడు. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో మద్రాస్, హైదరాబాద్ నగరాలు చుట్టేశాడు. సినిమాల్లోకి రావడానికి ముందు హైదరాబాద్ లో ఓ స్వీట్ షాప్ కూడా నడిపాడు. అందులో లడ్డూలు, కాజాలు వంటి స్వీట్లను తనే స్వయంగా తయారు చేసి విక్రయించాడు. అదే సమయంలో సినిమాలకు కూడా ఆడిషన్స్‌ ఇచ్చాడు. తన స్వీట్ షాప్ బిజినెస్ తో కూడబెట్టిన డబ్బుతోనే సినిమాల్లోకి అడుగు పెట్టాడు. మొదట కొన్ని సినిమాల్లో హీరోగా ట్రై చేశాడు. కానీ సక్సెస్ అవ్వలేకపోయాడు. ఆ తర్వాత తనే మెగాఫోన్ పట్టుకున్నాడు. డైరెక్టర్ గా మారిపోయాడు. అంతే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. అలా తన 32 ఏళ్ల కెరీర్ లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ ను తెరకెక్కించి టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలీ లాంటి కమెడియన్ ను కూడా హీరోగా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన హిస్టరీ ఈ డైరెక్టర్ సొంతం. మరి ఆయనెవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. ఇందులో ఉన్నది మరెవరో కాదు టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి.

ఇవి కూడా చదవండి

టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలకు ఎస్వీ కృష్ణా రెడ్డి పెట్టింది పేరు. కొబ్బరి బొండం మొదలుకొని, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, శుభ‌ల‌గ్నం, ఆహ్వానం, మావి చిగురు, య‌మ‌లీల‌, నెంబ‌ర్ వ‌న్‌, వినోదం, ఎగిరేపావురమా, ఆహ్వానం, ఉగాది, ఊయల, ప్రేమకు వేళాయెరా, పెళ్లి పీటలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు కృష్ణారెడ్డి.

ఇటీవలే ఘనంగా ఎస్వీ కృష్ణా రెడ్డి పుట్టిన రోజు వేడుకలు..

అన్నట్లు ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగానూ ఆకట్టుకున్నారు. పై ఫొటోలో ఉన్నస్టిల్ ‘పగడాల పడవ’ అనే సినిమాలోది. ఇందులో ఆయన ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ తరువాత చిరంజీవి నటించిన ‘కిరాతకుడు’ లో కూడా ఒక చిన్న పాత్ర చేసాడు కృష్ణా రెడ్డి. ఇక ఉగాది, అభిషేకం సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించాడు ఎస్వీ కృష్ణారెడ్డి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us