AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: భార్యను ఫ్రిజ్‌లో దాచి పెట్టే భర్త.. చివరకు.. ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే రివేంజ్ థ్రిల్లర్

ఈ మధ్యన హనీమూన్ మర్డర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్ని రోజులుగా ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువైపోతున్నాయి. దాదాపు ఇలాంటి క్రైమ్ కథతోనే ఈ సినిమా తెరకెక్కింది. భార్యా భర్తలు వారి మధ్యలో దూరే ప్రియుడు.. చివరకు వారి జీవితం ఏమైందన్నదే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కథ.

OTT Movie: భార్యను ఫ్రిజ్‌లో దాచి పెట్టే భర్త.. చివరకు.. ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే రివేంజ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 26, 2025 | 9:40 PM

Share

ఈ మధ్యన ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కొందరు తమ భాగస్వాములను దారుణంగా చంపుతున్నారు. ప్రియుడు/ప్రియురాలితో కలసి పక్కా స్కెచ్ వేసి మరీ తమ పార్ట్ నర్లను అంతమొందిస్తున్నారు. ఇంట్లో తమ ప్రేమ, ప్రేమికుడి గురించి ధైర్యంగా చెప్పలేని వారు ఇలాంటి దారుణాలకు ఎలా పాల్పడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర అవని హీరోయిన్ అవ్వాలని కలలు కంటుంది. ఇదే క్రమంలో ఆమె ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన అభి అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా అవని తన మామయ్య కొడుకు రామ్ ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే రామ్ ఒక టిపికల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అవనిని శారీరకంగా, మానసికంగా హింసిస్తాడు. ఆమె కళ్ల ముందే మరో అమ్మాయితో రిలేషన్ షిప్ పెట్టుకుంటాడు. అవనిని తీవ్రంగా కొట్టి, ఐస్ బాక్స్ లో దాచి పెడతాడు. దీనిని భరించలేని అవని తను ప్రేమించిన అభితో కలిసి తిరుగుతుంది. ఇది చూసిన భర్త మరింత రగిలిపోతాడు.

ఇదిలా జరుగుతుండగానే ఒక రోజు అవని భర్త రామ్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. దీంతో అవని షాక్ లోకి వెళ్లిపోతుంది. అసలు రామ్ ఎలా? ఎందుకు చనిపోయాడు? దీని వెనక అభి ఉన్నాడా? అసలు అవని వేశ్యగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా పేరు వైఫ్ ఆఫ్. ఈ ఏడాది జనవరిలో డైరెక్టుగా ఓటీటీలోకి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. భాను యేరబంది తెరకెక్కించిన ఈ సినిమాలో దివ్య శ్రీ గురుగుబెళ్లి (అవని), అభినవ్ మణికంఠ (అభి), నిఖిల్ గాజుల (రామ్) ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే సాయి శ్వేత, ప్రసాద్ రొంగల, వీర మనోహర్, కిరణ్ పుటకల తదితరులు కూడా వివిధ పాత్రల్లో మెరిశారు. మంచి సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్. ప్రస్తుతం వైఫ్ ఆఫ్ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..