AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 2400 కోట్ల హాలీవుడ్ హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. హార్ట్ పేషెంట్స్ చూడొద్దు

ఇతర భాషా సినిమాలతో పోల్చుకుంటే హాలీవుడ్ లో ఫ్రాంఛైజీ, సిరీస్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. అలా ఈ సిరీస్ సినిమాలకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రూ. 430 కోట్లతో తెరకెక్కిన ఈ హారర్ మూవీ ఏకంగా రూ. 2400 కోట్లు రాబట్టింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 2400 కోట్ల హాలీవుడ్ హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. హార్ట్ పేషెంట్స్ చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 26, 2025 | 9:25 AM

Share

హాలీవుడ్ లో ఉన్నటువంటి పలు పాపులర్ ఫ్రాంచైజ్ లలో ఇది కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలు బ్లాక బస్టర్స్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఫ్రాంఛైజీ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి పాపులర్ ఫ్రాంచైజ్ నుంచి దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆరో సినిమా వచ్చింది. గత నెలలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు రూ.430 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2400 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. గత సిరీస్ సినిమాల్లో లాగే ఈ మూవీలో కూడా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అది కూడా రెండు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉంది. అయితే సినిమాకు వీక్ హార్ట్ ఆడియెన్స్ మాత్రం దూరంగా ఉండడం మేలు. అలాగే చిన్న పిల్లలు అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దూరంగా ఉండాల్సిందే.

ఈ సినిమా పేరు ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. జాచ్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టెయిన్ తెరకెక్కించిన ఈ మూవీలో ట్లిన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్, ఓవెన్ పాట్రిక్ జాయ్నర్, ర్యా కిహ్ల్స్టెడ్, అన్నా లోర్, బ్రెక్ బాసింగర్, టోనీ టాడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మేలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు బుక్ మై షో స్ట్రీమ్ ప్లాట్‌ఫామ్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, పలు ఇతర భాషల్లో నూ అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమాను చూడాలంటే మాత్రం రెంట్ చెల్లించాల్సిందే. ఈ ఎ రేటెడ్ హారర్ మూవీ చూడాలంటే రూ.499 చెల్లించాల్సిందే. అయితే కొన్ని రోజులు ఆగితే ఈ సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ లోని ఓ సీన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..