AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండక్షన్ స్టవ్‌పై రోటీలు పొంగడం లేదా? ఈ చిన్న ట్రిక్స్‌తో గ్యాస్ స్టవ్‌లాగే మెత్తని రోటీలు మీ సొంతం!

చాలామంది ఇండక్షన్ స్టవ్‌పై రోటీలు చేయడం కష్టమని, అవి సరిగ్గా పొంగవని భావిస్తుంటారు. అయితే, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఇండక్షన్ మీద కూడా గ్యాస్ స్టవ్‌లాగే మెత్తని, పొంగే రోటీలను తయారు చేయవచ్చని తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అయితే, ఇండక్షన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లాట్ బాటమ్ ఉన్న పెనంను వాడటం ఇక్కడ కీలకం. దీంతో పాటు ఇండక్షన్ మీద రోటీ కాల్చేటప్పుడు ఉష్ణోగ్రత నియంత్రణ చాలా ముఖ్యం. మీడియం హీట్ వద్ద పెనం వేడెక్కిన తర్వాతే రోటీ వేయాలి. ఇకపోతే, పిండిని తడిపే విధానంలో కూడా..

ఇండక్షన్ స్టవ్‌పై రోటీలు పొంగడం లేదా? ఈ చిన్న ట్రిక్స్‌తో గ్యాస్ స్టవ్‌లాగే మెత్తని రోటీలు మీ సొంతం!
Soft Rotis Tips
Jyothi Gadda
|

Updated on: Mar 14, 2026 | 7:19 PM

Share

నేటి ఆధునిక వంటగదుల్లో ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరిగింది. పాలు వేడి చేయడం, కూరలు వండటం వరకు ఇండక్షన్ బానే ఉన్నా, రోటీలు కాల్చేటప్పుడు మాత్రం చాలామంది ఇబ్బంది పడతారు. గ్యాస్ మంట మీద పొంగినట్టు ఇండక్షన్ మీద రోటీలు పొంగవు, పైగా గట్టిగా వస్తాయని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. అయితే, కొన్ని సింపుల్‌ చిట్కాలతో మీరు ఇండక్షన్ మీద కూడా పర్ఫెక్ట్ రోటీలు చేయవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

1. పిండి కలపడంలోనే అసలు రహస్యం ఉంది:

రోటీలు మెత్తగా రావాలంటే పిండిని సరైన పద్ధతిలో కలపాలి. పిండిలో కొంచెం ఉప్పు, ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి, గోరువెచ్చని నీటితో కలపండి. పిండి మరీ గట్టిగా కాకుండా, సాఫ్ట్‌గా ఉండాలి. కలిపిన తర్వాత ఒక తడి గుడ్డ కప్పి 15-20 నిమిషాలు పక్కన పెడితే పిండి బాగా నానుతుంది.

ఇవి కూడా చదవండి

2. సరైన పాత్రను ఎంచుకోండి:

ఇండక్షన్ మీద వంట చేయడానికి ఫెర్రోమాగ్నెటిక్ బేస్ ఉన్న పాత్రలు అవసరం. రోటీల కోసం ఫ్లాట్ బాటమ్ ఉన్న ఇండక్షన్ ఫ్రెండ్లీ తవా (పెనం) వాడాలి. అడుగు భాగం ఎంత పల్చగా ఉంటే అంత త్వరగా, సమానంగా వేడి అందుతుంది.

3. ఉష్ణోగ్రత నియంత్రణ:

ఇండక్షన్ ఆన్ చేసిన వెంటనే హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. మీడియం హీట్ (సుమారు 800W – 1000W) వద్ద పెనం వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాతే రోటీని వేయాలి. ఒకవైపు చిన్న చిన్న బుడగలు రాగానే తిప్పాలి.

4. రోటీని పొంగించే విధానం:

రెండో వైపు కూడా కొంచెం కాలిన తర్వాత, ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని రోటీ అంచులను మెల్లగా నొక్కాలి. ఇలా చేయడం వల్ల లోపల గాలి చేరి రోటీ పూర్తిగా పొంగుతుంది. డైరెక్ట్ మంట లేకపోయినా, పెనం వేడితోనే రోటీలు బాగా కాలుతాయి.

గ్యాస్ సిలిండర్ అయిపోయినప్పుడు లేదా ఆదా చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతి మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే, ఇండక్షన్ మీద చేసిన రోటీలు కూడా గంటల తరబడి మెత్తగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us