AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ కష్టాలు.. డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..

D Mart: వంటింట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవస్తుందంటే చాలు.. ఇప్పుడు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరాలో అనిశ్చితి నెలకొన్న వేళ మహిళలు ప్రత్యామ్నాయాల వేటలో పడ్డారు. ఇదే సమయంలో మార్కెట్‌లో ఇండక్షన్ స్టవ్స్, రైస్ కుక్కర్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అయితే సామాన్యుడికి ఊరటనిస్తూ డీమార్ట్ వీటిపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది.

గ్యాస్ కష్టాలు.. డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
Dmart Induction Stove Offers
Krishna S
|

Updated on: Mar 14, 2026 | 5:46 PM

Share

దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో నెలకొన్న అనిశ్చితి సామాన్యుడి వంటగదిపై ప్రభావం చూపుతోంది. గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ ఆధారిత వంట పరికరాలైన ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వినియోగదారుల అవసరాలను గుర్తించిన ప్రముఖ రిటైల్ దిగ్గజం డీమార్ట్, వీటిపై ప్రత్యేకంగా 7 శాతం అదనపు డిస్కౌంట్ ప్రకటించి ఊరటనిచ్చింది.

ప్రస్తుతం డీమార్ట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ బ్రాండెడ్ ఆప్షన్లు ఇవే..

Pigeon Induction Cooktop Acer Plus (1800 W): అధిక సామర్థ్యం దీని ప్రత్యేకత. ఏడాది వారంటీతో లభించే ఈ స్టవ్, పెద్ద కుటుంబాలకు కూడా సరిపోతుంది.

Prestige Induction Cooktop PIC 20.0 (1600 W): ఇందులో ఇండియన్ మెనూ ఆప్షన్స్, టైమర్ ఫీచర్లు ఉండటంతో వంట చేయడం చాలా సులభం.

Wonderchef Swift (2200 W): అత్యంత వేగంగా వంట పూర్తి చేయాలనుకునే వారికి ఇది బెస్ట్. దీని పనితీరు మెరుగ్గా ఉంటుంది.

Prestige Spark (1200 W): తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన బ్రాండ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

పాపులర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు

వంట గదిలో పనిని తగ్గించి సమయాన్ని ఆదా చేసే రైస్ కుక్కర్లపై కూడా మంచి డీల్స్ ఉన్నాయి.

Agaro Regency (5L, 700 W): ఇది ఎక్కువ సామర్థ్యం కలది. ఒకేసారి 1.5 కేజీల బియ్యాన్ని ఉడికించవచ్చు. ఇందులో సిరామిక్ బౌల్, ఎల్ఈడీ లైట్లు, వేడిని నిలిపి ఉంచే కీప్ వార్మ్ ఫీచర్లు ఉన్నాయి.

Butterfly Blossom (1.8 L): స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో వచ్చే ఈ బేసిక్ మోడల్‌కు ఏకంగా 5 ఏళ్ల వారంటీ లభిస్తోంది.

Prestige Cute: దీనితో పాటు రెండు స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యాన్లు లభిస్తాయి. రైస్‌ను చాలా తక్కువ సమయంలో ఉడికిస్తుంది.

కొనడం ఎలా?

వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను రెండు పద్ధతుల్లో కొనుగోలు చేయవచ్చు..

ఆన్‌లైన్: డీమార్ట్ అధికారిక వెబ్‌సైట్ www.dmart.in లేదా వారి మొబైల్ యాప్‌లో లాగిన్ అయి, మీ నగరాన్ని ఎంచుకోవాలి. సెర్చ్ బాక్స్‌లో Induction cooktop లేదా ‘Electric rice cooker’ అని టైప్ చేసి ఆర్డర్ చేయవచ్చు.

ఆఫ్‌లైన్: నేరుగా మీకు దగ్గరలోని డీమార్ట్ స్టోర్‌కు వెళ్లి ఆఫర్ ధరకే వీటిని సొంతం చేసుకోవచ్చు.

గ్యాస్ ధరలు పెరగడం లేదా కొరత ఏర్పడినప్పుడు ఇండక్షన్ స్టవ్స్ వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా వంట కూడా సురక్షితంగా మారుతుంది. ఎల్‌పీజీ కొరతతో ఇబ్బంది పడే కంటే అందుబాటులో ఉన్న ఇలాంటి ఆధునిక వంట పరికరాలను రాయితీ ధరలో కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us