AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: గుండు కొట్టించుకుని న్యూ లుక్ లో హీరో అజిత్.. షాక్ లో ఫ్యాన్స్.. వీడియో ఇదిగో

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే విదాయుమిర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడీ సీనియర్ హీరో. అలాగే వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లోనూ సత్తా చాటాడు.

Ajith Kumar: గుండు కొట్టించుకుని న్యూ లుక్ లో హీరో అజిత్.. షాక్ లో ఫ్యాన్స్.. వీడియో ఇదిగో
Ajith Kumar
Basha Shek
|

Updated on: Jun 24, 2025 | 5:59 PM

Share

ఓవైపు సినిమాలు.. మరోవైపు కారు రేసులతో బిజి బిజీగా గడుపుతున్నారు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ . ఈ ఏడాది అతను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. విదాయుమిర్చి యావరేజ్ గా ఆడినా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ మధ్యలోనే వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటాడు అజిత్. వీటికి తోడు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసిన పద్మ భూషణ్ అవార్డును అందుకున్నాడీ హీరో. కాగా అజిత్ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్ డేట్ రాలేదు. సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో మళ్లీ కార్ రేసింగ్‌లో బిజీ అయిపోయాడు అజిత్. ప్రస్తుతం బెల్జియంలో తన జీటీ4 యూరోపియన్ సిరీస్ కోసం తలా రెడీ అవుతున్నాడు. ఈ వీకెండ్‌లో ఈ ప్రతిష్ఠాత్మక కార్ రేసింగ్‌ జరగనుంది. అయితే అజిత్ కుమార్‌ లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇందులో రేసింగ్‌ ట్రాక్‌పై సైకిల్ తొక్కుతూ కనిపించాడీ సీనియర్ హీరో. అయితే ఇందులో అజిత్ కుమార్‌ గుండు చేయించుకుని కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు.

అజిత్ ‍కుమార్‌ న్యూ లుక్ ను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ లుక్‌లో అజిత్ మరింత స్టైలిష్‌గా కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా తనకు గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ తోనే అజిత్ తన తర్వాతి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే అజిత్ ఇలా న్యూ లుక్ లోకి మారిపోయాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

 హీరో  అజిత్ కుమార్ న్యూ లుక్.. వీడియో ఇదిగో..

మరో రేసుకు రెడీ అవుతోన్న అజిత్.. ఈ వీకెండ్ లోనే పోటీలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..