AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ఠాగూర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించ లేరు

ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో దగ్గరకు పోవడం ఇండస్ట్రీలో మామూలే. కొన్ని సార్లు ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలతో మరొకరు బ్లాక్ బస్టర్స్ కొడుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ ఠాగూర్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.

Chiranjeevi: చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ఠాగూర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించ లేరు
Tagore Movie
Basha Shek
|

Updated on: Jun 23, 2025 | 6:42 PM

Share

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉండచ్చు గాక.. కానీ ఠాగూర్ సినిమాకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో అభిమానులకు నచ్చే కమర్షియల్ అంశాలతో పాటు ఓ మంచి సందేశం ఉంది. 2003లో రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రికార్డు కేంద్రాల్లో100 రోజులు ఆడింది. తమిళంలో తెరకెక్కిన రమణ సినిమాకు తెలుగు రీమేక్ గా ఠాగూర్ ను తెరకెక్కించారు. వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రియ, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. లంచం, అవినీతి అధికారులపై ఓ లెక్చరర్ సాగించిన పోరాటమే ఠాగూర్. ఇందులో చిరంజీవి నటన అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ డ్యాన్సులు, ఫైట్స్ కూడా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనొద్దు’, ‘తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం, క్షమించడం’ వంటి డైలాగులు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం.

అయితే ఠాగూర్ సినిమాకు హీరో చిరంజీవి ఫస్ట్ ఛాయిస్ కాదట. మరో హీరో కాదనడంతోనే మెగాస్టార్ లైన్ లోకి వచ్చారట. ఆ హీరో మరెవరో కాదు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. అవును ఠాగూర్ మేకర్స్ చిరంజీవి కంటే ముందు రాజశేఖర్ నే కలిశారట. కథ మొత్తం చెప్పారట. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయారట. దీంతో అది చిరంజీవి వద్దకు వెళ్లిందట. కథ విన్న వెంటనే మెగాస్టార్ ఒకే చెప్పడం, సినిమా పట్టాలెక్కడం, ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్ అవ్వడం చకా చకా జరిగిపోయాయి.

ఇవి కూడా చదవండి

భార్య జీవితతో రాజ శేఖర్..

కాగా ఠాగూర్ ఒక్కటే కాదు రాజశేఖర్ చాలా సూపర్ హిట్ సినిమాలు మిస్ చేసుకున్నారట. చిరంజీవి ఆరాధన, అర్జున్ జెంటిల్ మెన్, వెంకటేష్ చంటి, బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, రానా నేనే రాజు నేనే మంత్రి, హనుమాన్ జంక్షన్ తదితర సినిమాలన్నీ మొదట రాజశేఖర్ దగ్గరకు వచ్చినవేనట. అయితే వివిధ కారణాలతో వేరే హీరోల దగ్గరకు వెళ్లాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..