- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Couple Rocking Rakesh Sujatha Daughter Annaprasana Celebrations Photos Go Viral
Jabardasth Rakesh: ‘మా పాప తొలి పండుగ’.. రాకింగ్ రాకేష్- సుజాతల కూతురి అన్నప్రాసన వేడుక ఫొటోస్ చూశారా?
జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గతేడాది అక్టోబర్ లో అమ్మానాన్నలయ్యారు. సుజాత ఒక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తమ ఇంటి మహలక్ష్మికి ఖ్యాతిక అని పేరు పెట్టుకున్నారు. తాజాగా తమ గారాల పట్టి అన్న ప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు రాకేష్- సుజాత
Updated on: Jun 22, 2025 | 7:01 PM

రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత లది ప్రేమ వివాహం. జబర్దస్త్ షోలో చేస్తున్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో2203 ఫిబ్రవరి 24న తిరుమల వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు రాకేష్- సుజాత

రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది అక్టోబర్ లో ఖ్యాతిక వీరి ఇంట్లోకి అడుగు పెట్టింది. గతేడాది నవంబర్ లోనే ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారి సన్నిధిలో తమ కూతురి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

తాజాగా ఖ్యాతిక అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు జబర్దస్త్ కపుల్. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీటికి 'మా పాప తొలి పండుగ' అని క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ఈ ఫొటోల్లో ఖ్యాతిక ఎంతో క్యూట్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ క్యూట్, పాప చాలా బాగుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

కాగా రాకింగ్ రాకేష్ ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. మరోవైపు సుజాత మాత్రం పాపను చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటోంది. అయితే అప్పుడప్పుడు మాత్రం టీవీ షోల్లో మెరుస్తోంది.

రాకింగ్ రాకేష్ హీరోగా కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన కేసీఆర్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. దీని తర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు రాకేష్.




