- Telugu News Photo Gallery Cinema photos Do You Know this Actress Who Has 9 Flops and No Solo Hit in 11 Years, Still Her Charges 10 Crores Remuneration per One Movie, She is Tapsee Pannu
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..
దశాబ్దాలుగా సినీరంగంలో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ చిన్నది.. అటు సోషల్ మీడియాలోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ గత 11 ఏళ్లలో ఆమె నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఈ బ్యూటీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
Updated on: Jun 23, 2025 | 1:53 PM

పాన్ ఇండియా లెవల్లో ఆమె స్టార్ హీరోయిన్. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఒక్కో సినిమాకు రూ.11 కోట్లకు పైగా రెమ్యురనేషన్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరంటే..

తనే హీరోయిన్ తాప్సీ పన్నూ. ఆమె నటించిన 9 సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా ఇప్పటికీ ఒక్కో సినిమాకు రూ.11 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. అలాగే తన డైట్ కోసం నెలకు దాదాపు లక్ష ఖర్చు చేస్తుంటుందట. తెలుగు సినీప్రియులకు ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

1987 ఆగస్ట్ 1న ఢిల్లీలో జన్మించిన తాప్సీ.. హరి నగర్ లోని గురు తేజ్ బహదూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కొన్నాళ్లు సాఫ్ట్ వేర్ జాబ్ చేసిన ఆమె.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ.

మొదట్లో ఎన్నో బ్రాండ్స్ ప్రకటనలలో కనిపించిన తాప్సీ.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు తెలుగులోనే అత్యధిక చిత్రాల్లో నటించింది. ఝుమ్మంది నాదం సినిమా తర్వాత తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది.

కానీ కొన్నాళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటుంది తాప్సీ. ఆమె ఎక్కువగా హిందీలోనే వరుస సినిమాల్లో నటిస్తుంది. అయితే అక్కడ కూడా ఈ అమ్మడకు అదృష్టం కలిసిరాలేదు. హిందీలో ఆమె నటించిన చిత్రాలకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.




