AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Chinmayi: ‘వీరంతా ఎప్పుడు చస్తారో’.. సింగర్ చిన్మయి మరో సంచలన పోస్ట్.. ఏం జరిగిందంటే?

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తుంటుందామె. సామాజిక సమస్యలు, అంశాలపై తన దైన శైలిలో గళమెత్తే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది.

Singer Chinmayi: 'వీరంతా ఎప్పుడు చస్తారో'.. సింగర్ చిన్మయి మరో సంచలన పోస్ట్.. ఏం జరిగిందంటే?
Singer Chinmayi Sripada
Basha Shek
|

Updated on: Jun 22, 2025 | 7:38 PM

Share

దక్షిణాదిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. అదే సమయంలో మీటూ, క్యాస్టింక్ కౌచ్ వంటి విషయాల్లో తన గొంతకను బలంగా వినిపించింది. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ ఆమెపై నిషేధం విధించింది. అయితేనేం తన పోరాటం ఆపడం లేదీ ట్యాలెంటెడ్ సింగర్. సామాజిక మాధ్యమాల వేదికగా సామాజిక అంశాలు, సమస్యలపై తన దైన శైలిలో గళం వినిపిస్తుంటుంది.కొన్ని సార్లు చిన్మయి పోస్టులు వివాదాలకు దారి తీస్తుంటాయి. విమర్శలు కూడా వస్తుంటాయి. అయితేనేం తన నమ్ముకున్న దారిలోనే బలంగా వెళుతోంది చిన్మయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఏపీలో వెలుగు చూసిన ఓ గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన చిన్మయి.. ‘వీరు ఎందుకు పుట్టారో తెలియదు కానీ ఎప్పుడు చస్తారో’ అంటూ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ‘నేను ఈ దారుణాన్ని భరించలేకపోతున్నాను. 14 మంది రెండేళ్లుగా ఓ 15ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. అంటే ఇక్కడ అమ్మాయిలకు టూ మచ్ రైట్స్ ఉన్నట్లు.. అబ్బాయిలో డేంజర్‌లో ఉన్నట్లా? ఈ రేపిస్టులను కాల్చి బూడిదగా మార్చేయాలి. ఇప్పుడు గ్యాంగ్ రేప్ న్యూ కల్చర్ అయిపోయింది. ఎందుకు పుట్టారో తెలియదు కానీ వీళ్లందరు ఎప్పుడు చస్తారో’ అంటూ అంటూ ట్వీట్ చేసింది చిన్మయి.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు చిన్మయికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఏపీలో 15 ఏళ్ల దళిత బాలికపై 14 మంది దుండుగులు రెండేళ్లుగా అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బాలిక గర్భం దాచడంతో ఈ దారుణం బయట పడింది. నిందితుడు బాలికను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ మైనర్‌తో సహ 17 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు నోయిడాలోని 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై కూడా తీవ్రంగా స్పందించింది చిన్మయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి