AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: నలుగురు హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే.. విశ్వక్ సేన్‌ ఖాతాలో భారీ డిజాస్టర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో పైకొచ్చిన హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే ఈ హీరో కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డైరెక్టర్ అనుదీప్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

Vishwak Sen: నలుగురు హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే.. విశ్వక్ సేన్‌ ఖాతాలో భారీ డిజాస్టర్
Vishwak Sen
Basha Shek
|

Updated on: Jun 22, 2025 | 6:10 PM

Share

ఛైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో మెరిసిన విశ్వక్ సేన్ వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఫలక్ నుమా దాస్, హిట్, అశోక వనంలో అర్జన కల్యాణ్ం, దాస్ కా దమ్కీ, గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలతో టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు విశ్వక్ సేన్. అయితే ఈ హీరో నటించిన చివరి చిత్రం లైలా. రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దీనికి తోడు విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించడంతో సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ కూడా ఈ సినిమాను వార్తల్లో నిలిచాయి. ఇలా అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) కానుకగా విడుదలైన లైలా సినిమా మొదటి షో నుంచే పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. విశ్వక్ సేన్ సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

లైలా దెబ్బకు విశ్వక్ సేన్ కూడా డీలా పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇకపై కథల ఎంపికల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని అభిమానులకు వివరణ ఇచ్చాడు. అయితే ఈ లైలా సినిమాకు హీరోగా విశ్వక్ సేన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అతని కంటే ముందు నలుగురు హీరోలకు ఈ కథను చెప్పారట మేకర్స్. అయితే సినిమాలో హీరో లేడీ క్యారెక్టర్ రోల్ లో కనిపించాల్సి ఉండడంతో సదరు హీరోలు సినిమాను రిజెక్ట్ చేశారట. సినిమా ప్రమోషన్లలో హీరో విశ్వక్ సేనే స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు. అయితే ఆ హీరోల పేర్లు మాత్రం వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

లైలా సినిమాలో లేడీ గెటప్ రోల్ లో హీరో విశ్వక్ సేన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..