AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ గడ్డపై నెట్‌ఫ్లిక్స్‌ని ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌ గడ్డపై నెట్‌ఫ్లిక్స్‌ని ప్రారంభించిన సీఎం రేవంత్

Phani CH
|

Updated on: Mar 14, 2026 | 7:28 PM

Share

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌ను సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రంగా అభివర్ణించిన సీఎం, నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో పెద్ద కార్పొరేట్ ఆఫీస్‌కు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ వ్యాపారానికి అనుకూలమైన ప్రదేశమని, పెట్టుబడులకు రక్షణ ఉంటుందని పునరుద్ఘాటించారు.

హైదరాబాద్‌లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ స్టూడియోస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. సౌత్‌ సినిమా పరిశ్రమకు కేంద్ర బిందువుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించడపై ఆనందం వ్యక్తం చేశారు. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్టే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందన్నారు .నెట్‌ఫ్లిక్స్‌ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anil Ravipudi: యానిమేషన్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్న అనిల్‌

Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??

Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా

Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??

కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే

Follow Us