- Telugu News Entertainment Tollywood Interesting Facts About Actor Naveen Chandra Wife Orma, See Their Latest Family Photos
Naveen Chandra: హీరో నవీన్ చంద్ర ఫ్యామిలీని చూశారా? భార్య కూడా సినిమా ఇండస్ట్రీనే.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
నవీన్ చంద్ర.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న పేరు. మరీ ముఖ్యంగా ఓటీటీలో ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో పేరు మార్మోగిపోతోంది. అతను నటించిన సినిమాలు ఇటీవల ఓటీటీల్లో దుమ్ము రేపుతున్నాయి. నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి.
Updated on: Jun 23, 2025 | 7:23 PM

కెరీర్ ప్రారంభంలో ఇతర హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేశాడు నవీన్ చంద్ర. ఆ తర్వాత అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాలోన తన అద్బుతమైన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశాడు.

దళం, భమ్ భోలేనాథ్, త్రిపుర, లక్ష్మీ దేవికి ఓ లక్కుంది, మీలో ఎవడు కోటీశ్వరుడు, జూలియన్ లవర్ ఆఫ్ ఈడియట్, భానుమతి రామకృష్ణ తదితర సినిమాల్లోనూ హీరోగా ఆకట్టుకున్నాడు నవీన్ చంద్ర.

అదే సమయంలో నేను లోకల్, మిస్ ఇండియా, ఎవరు, అరవింద సమేత వీర రాఘవ, విరాట పర్వం, జిగర్తాండ డబుల్ ఎక్స్ తదితర సినిమాల్లో నెగెటివ్ రోల్స్, విలన్ పాత్రలతోనూ మెప్పించాడు.

ఇటీవల నవీన చంద్ర నటించిన సినిమాలు 28 డిగ్రియస్ సెల్సియస్, లెవెన్, ది బ్లైండ్ స్పాట్ సినిమాలో ఓటీటీల్లో దమ్ము దులిపేశాయి. నేషనల్ వైడ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి.

సినిమాల సంగతి పక్కన పెడితే.. నవీన్ చంద్ర భార్య పేరు ఒర్మా. వీరిది ప్రేమ వివాహం. అన్నట్లు ఒర్మాది కూడా సినిమా ఇండస్ట్రీ నేపథ్యమే. ఆమె చాలా సంవత్సరాల పాటు మలయాళంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసింది.

మలయాళం స్టార్ డైరెక్టర్ సిద్దిఖ్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసింది ఒర్మా. అందుకే నవీన్ చంద్ర దగ్గరకు వచ్చే సినిమా కథలను విని జడ్జ్ కూడా చేస్తుందట. భవిష్యత్తులో ఆమె డైరెక్టర్ గా మారి సినిమా తీయొచ్చేమో అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర.




