AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్‌ స్టార్ట్ చేసిన అమెరికా స్టార్టప్!!

ప్రకృతి నియమం ప్రకారం సూర్యుడు అస్తమించగానే చీకటి పడుతుంది. కానీ, భవిష్యత్తులో మనం కోరుకున్నప్పుడు రాత్రి వేళల్లో కూడా సూర్యకాంతిని పొందవచ్చు. కానీ, భవిష్యత్తులో మనకు నచ్చినప్పుడు రాత్రిని పగలుగా మార్చుకునే సాంకేతికత అందుబాటులోకి రానుంది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత చీకటి పడటం ప్రకృతి సిద్ధం. కానీ, కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే సంస్థ అంతరిక్షం నుండి సూర్యరశ్మిని అద్దెకు ఇచ్చే సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టింది.

రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్‌ స్టార్ట్ చేసిన అమెరికా స్టార్టప్!!
Artificial Sunlight At Night
Jyothi Gadda
|

Updated on: Mar 19, 2026 | 9:21 AM

Share

సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత చీకటి పడటం సహజం. కానీ, భవిష్యత్తులో మనం కోరుకున్నప్పుడు రాత్రిని పగలుగా మార్చుకునే సాంకేతికత అందుబాటులోకి రానుంది. అవును. మీరు విన్నది నిజమే.. కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే సంస్థ అంతరిక్షం నుండి సూర్యరశ్మిని అద్దెకు ఇచ్చే సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. అమెరికాకు చెందిన రిఫ్లెక్టివ్’ (Reflect Orbital) అనే స్టార్టప్ సంస్థ, అంతరిక్షం నుండి రాత్రి పూట భూమిపైకి సూర్యకాంతిని పంపే వినూత్న ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఇందుకోసం భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులో సుమారు 50,000 అద్దాలను (Mirrors) కక్ష్యలో ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ అద్దాలు సూర్యరశ్మిని పట్టుకుని, అవసరమైన ప్రాంతాలపైకి పరావర్తనం చెందిస్తాయి.

ముఖ్యంగా సోలార్ పవర్ ప్లాంట్లు రాత్రి వేళల్లో కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, అలాగే అత్యవసర పరిస్థితుల్లో వెలుతురు కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని సంస్థ చెబుతోంది. అయితే, ఈ సౌకర్యం ఉచితం కాదు. నివేదికల ప్రకారం, ఒక నిర్దిష్ట ప్రాంతంలో 5 నిమిషాల పాటు సూర్యకాంతిని పొందడానికి సుమారు రూ. 4.6 లక్షలు ($5,500) ఖర్చవుతుంది. ఈ ప్రయోగం పట్ల శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పర్యావరణానికి, జీవవైవిధ్యానికి ముప్పు కలిగిస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది?: ఈ స్టార్టప్ సంస్థ భూమి చుట్టూ తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో (LEO) వేలాది ఉపగ్రహాలను ప్రవేశపెడుతుంది. ఈ ఉపగ్రహాలకు అతిపెద్ద అద్దాలు అమర్చబడి ఉంటాయి. భూమిపై ఎక్కడైనా వెలుతురు కావాలని ఆర్డర్ ఇస్తే, ఈ అద్దాలు సూర్యకాంతిని ఖచ్చితంగా ఆ ప్రాంతంపైకి మళ్ళిస్తాయి. సుమారు 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఈ వెలుతురును ప్రసరింపజేయవచ్చని సంస్థ వ్యవస్థాపకుడు బెన్ నోవాక్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ధర, ఉపయోగాలు: ఈ సేవ చాలా ఖరీదైనది. కేవలం 5 నిమిషాల పాటు సూర్యరశ్మిని పొందడానికి వినియోగదారులు సుమారు రూ. 4.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మేఘాలు లేని రాత్రి వేళల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించవచ్చు. భూకంపాలు లేదా వరదల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే, రక్షణ చర్యల కోసం ఈ వెలుతురును వాడుకోవచ్చు. రాత్రి పూట జరిగే భారీ క్రీడలు లేదా వేడుకల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు.

పర్యావరణ ఆందోళనలు: అయితే, ఈ ప్రాజెక్ట్ పట్ల ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట కృత్రిమ వెలుతురు వల్ల పక్షులు, జంతువుల జీవన చక్రం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఆకాశం ఎప్పుడూ వెలుగుతూ ఉండటం వల్ల నక్షత్రాల పరిశీలనకు (Astronomy) ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా చేస్తున్న ఈ ప్రయోగం సఫలమవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ సంస్థ తన వెబ్‌సైట్‌లో బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us