AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Results: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

తెలంగాణ ఇంటర్‌మీడియట్ ఫలితాలపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిజల్ట్స్‌ను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. జూన్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసారి రికార్డు స్థాయిలో వేగంగా వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనుంది.

Inter Results: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?
Telangana Intermediate Results 2026
Krishna S
|

Updated on: Mar 19, 2026 | 9:56 AM

Share

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఇంటర్ ఫలితాలను వీలైనంత త్వరగా అంటే ఏప్రిల్ 10 లోపు, వీలైతే ఏప్రిల్ 6వ తేదీనే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలవగా, ఈసారి దాదాపు రెండు వారాల ముందే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలను పునఃప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. ఈ లోపే ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, వారి ఫలితాలను కూడా మే 31 నాటికి వెల్లడించాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనివల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా పై చదువులకు వెళ్లే అవకాశం ఉంటుంది.

ముమ్మరంగా సాగుతున్న వాల్యూయేషన్

ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో ఆన్సర్ షీట్స్ దిద్దుబాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఫలితాలను త్వరగా ఇచ్చేందుకు వీలుగా ఈసారి మూల్యాంకన సమయాన్ని పెంచారు. గతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వాల్యూయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచారు.

అధ్యాపకుల ఆందోళన

అయితే సమయం పెంచడంతో పాటు మూల్యాంకనానికి ఇచ్చే పేపర్ల సంఖ్యను కూడా పెంచడంపై అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుకు 30 పేపర్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్యను 45 వరకు పెంచడం వల్ల ఏకాగ్రత లోపించి విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని వరంగల్ వంటి కేంద్రాల్లోని అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై స్పందించిన బోర్డు కార్యదర్శి.. పేపర్ల సంఖ్యను 40 లోపే ఉంచాలని ఆదేశించామన్నారు. పండుగ సెలవుల విషయంలో కూడా స్పష్టతనిస్తూ ఉగాది లేదా రంజాన్ జరుపుకోవాలనుకునే వారు సెలవు తీసుకోవచ్చని, క్యాంపులు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

Follow Us
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!
ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్
ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్
పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు
పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు
ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..
ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..
రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!
రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!
ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?
ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!
కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్