వర్షాకాలంలో పుదీనా తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!

24 July  2026

Jyothi Gadda

అయితే, వేసవిలో మేలు చేసే ఈ పుదీనా వర్షాకాలంలో మాత్రం ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆయుర్వేద మరియు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో పుదీనాతో ప్రమాదాలేంటో చూద్దాం..

బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాప్తి: వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. నేలపైన లేదా తేమ ఉన్న ప్రదేశాలలో పెరిగే పుదీనా ఆకులపై బ్యాక్టీరియా, ఫంగస్, క్రిమి కీటకాలు త్వరగా చేరుతాయి.

ఆకుల అడుగుభాగంలో సూక్ష్మజీవులు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. వీటిని సరిగ్గా కడగకుండా తింటే ఫుడ్ పాయిజనింగ్, ఇతర ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

జీర్ణవ్యవస్థపై ప్రభావం: ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో మన శరీరంలోని జఠరాగ్ని సహజంగానే మందగిస్తుంది. ఆకుకూరలు, ముఖ్యంగా పుదీనా వంటి ఆకులను పచ్చిగా తింటే జీర్ణం కావడం కష్టమవుతుంది.

ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది. వర్షాకాలంలో పంటలకు, మొక్కలకు లభించే నీరు తరచుగా కలుషితమవుతుంది. పుదీనా మొక్కలు కలుషిత నీటిని త్వరగా పీల్చుకుంటాయి.

అటువంటి వాతావరణంలో పెరిగిన ఆకులను వాడటం వల్ల డయేరియా, వాంతులు అయ్యే అవకాశాలు ఎక్కువ. వర్షాకాలపు తేమ వల్ల పుదీనా ఆకులపై సూక్ష్మజీవులు, ఫంగస్ సులువుగా చేరుతాయి.

సరిగ్గా శుభ్రం చేయని ఆకుల వల్ల జీర్ణశక్తి మందగించి కడుపు నొప్పులు వస్తాయి. జాగ్రత్తలు పాటించడం.ఈ సీజన్ లో పచ్చి పుదీనాకు దూరంగా ఉండి, బాగా ఉడికించి మాత్రమే వాడాలి.

వర్షాకాలంలో పచ్చి పుదీనాతో చేసిన చట్నీలు లేదా పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ పుదీనా వాడాల్సి వస్తే, ఆకులను ఉప్పు నీటిలో లేదా వెనిగర్ నీటిలో చాలాసేపు నానబెట్టి బాగా కడగాలి.