AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth : వాడి నాశనం చూశాకే చచ్చిపోతా.. నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను, అవకాశాల కోసం కళాకారులు పడే ఇబ్బందులను చలాకీ చంటి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అహం (ఈగో), భజన సంస్కృతి, తోటి వారి వెన్నుపోట్లతో తన కెరీర్ ఎలా దెబ్బతిందో వివరించారు. జబర్దస్త్ ఆదాయం, ఆర్థిక కష్టాలు, తిరిగి వెళ్లేందుకు నిరాకరణ వంటి విషయాలపై భావోద్వేగంగా మాట్లాడారు.

Jabardasth : వాడి నాశనం చూశాకే చచ్చిపోతా.. నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
Chalaki Chanti
Rajitha Chanti
|

Updated on: Jul 25, 2026 | 11:32 AM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న చలాకీ చంటి, ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ వెనుక ఉన్న ఎన్నో చేదు నిజాలను, భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. పరిశ్రమలో కళాకారులు ఎదుర్కొనే సమస్యలు, భజన సంస్కృతి, ఈగో వంటి అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు తనను “చంటన్న” అని పిలవడం ప్రేమతో కూడుకున్నదని, కానీ మరికొందరు దానిని ఈగోగా భావించి అవకాశాలు దూరం చేశారని చంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో, ఒక డైరెక్టర్ తనను పేరుతో పిలవమని కోరితే, అలాగే పిలిచానని, అయితే పక్కన ఉన్న టీమ్ సభ్యులు దానిని తప్పుగా అర్థం చేసుకొని, తన పాత్రను తొలగించేలా చేశారని వివరించారు. మరొక సంఘటనలో, ఒక పెద్ద సినిమాలో లీడింగ్ ఆర్టిస్ట్ పాత్రకు కమిట్ అయిన తర్వాత, డైరెక్టర్ తండ్రి పక్కన సిగరెట్ తాగుతూ సాధారణంగా మాట్లాడినందుకు తన పాత్రను తీసేశారని, అది తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.

పరిశ్రమలో విజయానికి టాలెంట్ కన్నా భజన ముఖ్యమని చలాకీ చంటి చెప్పుకొచ్చారు. “భజన కొట్టినంత సేపు నువ్వు ఎన్ని లంగా లఫూట్ పనులు చేసినా యు ఆర్ గ్రేట్. భజన కొట్టకపోయి నువ్వు ఒక్క మంచి పని చేసినా అది వాడికి నచ్చలేదు అనుకోరా నీ అంత గలీజ్ గాడు ఇంకోడు లేడు” అని అన్నారు. కళాకారులు పూర్తిగా తమను తాము డైరెక్టర్లకు అంకితం చేసుకోవాలనే అంచనాలు కూడా ఉంటాయని, “మీరే దిక్కు అబ్బా. నా జీవితం మీ వల్లే నడుస్తుంది” అనే స్థాయిలో ప్రవర్తిస్తేనే అవకాశాలు వస్తాయని ఆయన సూచించారు.

ఈగో అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుందని, తనపై “ఈగో” అనే ప్రచారం చేసి, తన కెరీర్‌ను దెబ్బతీసిన ప్రతి ఒక్కరూ నాశనం కావాలని, తాను బతికుండగానే అది చూడాలని దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన భావోద్వేగంగా అన్నారు. తన శత్రువులు ఎవరంటే, “పబ్లిసిటీ చేసినవాడే శత్రువు” అని చంటి స్పష్టం చేశారు. ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ కోసం సిద్ధమైనప్పుడు, చివరి క్షణంలో ఆ సెలబ్రిటీ రాకపోతే, ఆ కోపం సెలబ్రిటీ మీద కాకుండా, ఆ ఇంటర్వ్యూ జరగకుండా అడ్డుకున్న వ్యక్తి మీద వస్తుందని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..

Follow Us
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..
చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన
చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన
అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి..
అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి..