AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

బిగ్ బాస్ సందడి మొదలైంది. బుల్లితెరపై వరుస ప్రోమోలతో ఈ షో గురించి మరింత ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు అగ్నీపరీక్ష కౌంట్ డౌన్ స్టార్ కాగా.. ఇటు సోషల్ మీడియాలో పలువురు సెలబ్రేటీల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా తనకు ఆఫర్ రావడం గురించి స్పందించింది జబర్దస్త్ లేడీ కమెడియన్. బిగ్ బాస్ సీజన్ 10లోకి రావాలని తనకు కాల్ వచ్చినట్లు తెలిపింది.

Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2026 | 8:41 AM

Share

జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సత్యశ్రీ, ప్రస్తుతం వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సత్యశ్రీ గత మూడేళ్లుగా సినీ రంగంలోనే ఎక్కువగా కనిపిస్తున్నారని, టెలివిజన్‌కు దూరమయ్యారని అడగ్గా… దీనిపై సత్యశ్రీ స్పందిస్తూ, జబర్దస్త్ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, అందుకే టెలివిజన్‌కు తక్కువగా కనిపిస్తున్నానని తెలిపారు. తన కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నానని, అయితే ప్రస్తుతం ఒక నిర్దిష్ట దశలో ఉన్నందున, తన రెప్యూటేషన్, స్వీయ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్నానని ఆమె వివరించారు. “ఈ గ్లామర్ ఉన్నంత వరకే ఏదైనా. ఈ గ్లామర్ ఉన్నంత వరకు కొంచెం చూస్ చేద్దాము అనేది ఉంది” అని ఆమె పేర్కొన్నారు.

రీసెంట్‌గా విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రంలో సత్యశ్రీ మంచి పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “నవీన్ పొలిశెట్టి సెట్స్‌లో కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఎప్పుడూ పని, పని, పని అనే ధోరణిలో ఉంటారు. 24/7 వర్క్‌కే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి షాట్ తర్వాత తర్వాతి పనిపైనే దృష్టి సారిస్తారు. ఆయనతో మాట్లాడింది తక్కువ, పనిలో నిమగ్నమై ఉన్నది ఎక్కువ” అని సత్యశ్రీ వివరించారు. నవీన్ శెట్టి పోలిశెట్టి (జాతిరత్నాలు) సినిమాలో తాను ఒక చిన్న పాత్ర చేశానని, అప్పుడే నవీన్ “మీరు కచ్చితంగా ఇంకొక మూవీలో చేద్దురు గానీ” అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆయన తన మాటను నిలబెట్టుకుని అనగనగా ఒక రాజులో అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, నవీన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సత్యశ్రీకి బిగ్‌బాస్ సీజన్ 10 నుండి ఆఫర్ వచ్చిందని, అయితే ఆమె వెళ్లడం లేదని వస్తున్న వార్తలపై యాంకర్ ప్రశ్నించగా, ఆమె దాన్ని ధృవీకరించారు. “నాకు బిగ్‌బాస్ నుండి వచ్చిన మాట నిజమే. కానీ, నా కుటుంబ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. నా తల్లిదండ్రులను వదిలి అంతకాలం ఇంట్లో ఉండలేను. వారు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే ఆ ఆఫర్‌ను తిరస్కరించాను” అని సత్యశ్రీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, అయితే వారిని చూసుకోవడానికి ఇంకొకరు ఉంటారని, కానీ తనకు ఆ పరిస్థితి లేదని ఆమె వివరించారు.

సత్య శ్రీ పోస్ట్..

View this post on Instagram

A post shared by Satya Sri (@me_satyasri)

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

Follow Us
అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..!
అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..!
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు