AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

తెలుగు సినీ ప్రపంచంలో హీరోగా, ఆ తర్వాత నటుడిగా తనదైన ముద్ర వేశారు శ్రీకాంత్. విలన్ పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణం ఊహించని విధంగా హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందుకున్నారు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఒక సినిమా వల్ల తన గ్రాఫ్ మొత్తం పడిపోయిందని... ఆ తర్వాత సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి పడిన కష్టాలను వివరించారు.

Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
Srikanth
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2026 | 3:09 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలం హీరోగా రాణించిన శ్రీకాంత్.. ప్రస్తుతం సహయ నటుడిగా అలరిస్తున్నారు. యంగ్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సినీ ప్రస్థానం, ఎదురైన సవాళ్లు, మలుపుల గురించి వివరించారు. శ్రీకాంత్ సినీ రంగ ప్రవేశం కలలో కూడా ఊహించని విధంగా జరిగిందని తెలిపారు. మొదట్లో సినిమా పరిశ్రమలోకి రావాలని మాత్రమే కోరుకున్నానని, ఎలాంటి నిర్దిష్ట ప్రణాళికలు లేవని చెప్పారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్ ద్వారా నటనలో మెలకువలు నేర్చుకోవడం కెమెరా ముందు భయం లేకుండా నిలబడటానికి సహాయపడిందని, అయితే పరిశ్రమలో ఎవరూ పరిచయం లేరని, చాలా మొహమాటంగా ఉండేవాడినని వెల్లడించారు. “పీపుల్స్ ఎన్‌కౌంటర్” సినిమాతో తన ప్రయాణం మొదలైందని, ఆ తర్వాత “మధురానగరి”, “సీతారత్నంగారి అబ్బాయి” వంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయని శ్రీకాంత్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

“సీతారత్నంగారి అబ్బాయి” చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి మొదట అనుమానపడ్డానని.. కానీ పరిశ్రమలో స్థిరపడాలనే ఉద్దేశంతో ఒప్పుకున్నానని చెప్పారు. ఇలా దాదాపు 15 చిత్రాలలో విలన్‌గా నటించానని, విలన్‌గానే తన కెరీర్ ముగుస్తుందని భావించానని శ్రీకాంత్ వెల్లడించారు. తాను ప్రత్యేకంగా ఒక రూట్‌ను సృష్టించుకోలేదని, తన సక్సెస్‌లు, గుడ్‌విల్, టైమింగ్ వంటివి తన కెరీర్‌ను నడిపించాయని ఆయన పేర్కొన్నారు. హీరోగానే నటిస్తానని పట్టుబట్టి కూర్చోలేదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నానని శ్రీకాంత్ అన్నారు. ఈ సమయంలో భరద్వాజ్ గారు తనను హీరోగా పరిచయం చేస్తానని హామీ ఇచ్చారని, విలన్ పాత్రలు మానేయమని చెప్పడంతో, ఆయన మాటపై నమ్మకంతో అన్ని కమిట్‌మెంట్‌లను పూర్తి చేసుకుని రెండు మూడు నెలలు వేచి చూశానని శ్రీకాంత్ తెలిపారు. అనుకున్నట్లుగానే భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన “వన్ బై టు” చిత్రంతో తాను, జె.డి.చక్రవర్తి హీరోలుగా పరిచయం అయ్యారని, ఆ చిత్రం 100 రోజులు ఆడి మంచి విజయం సాధించిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

శివనాగేశ్వరరావు సహకారంతో ఆ కెరీర్ ముందుకు సాగిందని, అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడలేదని అన్నారు. అదే బ్యానర్‌లో “దొంగ రాస్కెల్” వచ్చిందని, ఆ తర్వాత “ఆమె”, “పెళ్ళి సందడి”, “ఆహ్వానం”, “ఎగిరే పావురమా”, “వినోదం” వంటి వరుస విజయాలతో సోలో హీరోగా స్థిరపడ్డానని శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. ఇవన్నీ దైవఘటనే అని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి గారిని తన గాడ్‌ఫాదర్‌గా, స్ఫూర్తిగా భావిస్తానని, ఆయన స్ఫూర్తితోనే పరిశ్రమలోకి వచ్చానని శ్రీకాంత్ అన్నారు. మహాత్మ తన 100వ చిత్రం అని, ఆ తర్వాత కెరీర్‌లో ఒక మలుపు వచ్చిందని శ్రీకాంత్ వెల్లడించారు. “మహాత్మ” తర్వాత దాదాపు 25 చిత్రాలలో హీరోగా నటించినా అవి విజయాలు సాధించలేదని, దీనికి కారణం ఏమిటో తనకు తెలియదని అన్నారు. కొంతమంది కాలం బాగోలేదని అంటుంటారని, యువ నటుల ప్రవేశం కూడా ఒక కారణం కావచ్చని శ్రీకాంత్ అన్నారు. బోయపాటి సినిమా వచ్చే వరకు మధ్యలో ఒక సైలెంట్ గ్యాప్ వచ్చిందని ఆయన అన్నారు. తనకు వచ్చిన సినిమాల్లోనే మంచివి ఎంపిక చేసుకునేవాడినని, ఎప్పుడూ ఒక ప్లాన్‌తో కెరీర్‌ను నడిపించలేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 6 కోట్లతో తీస్తే రూ.16 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..

ఎక్కువ మంది చదివినవి : Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

Follow Us