Rajamouli: ఫ్రాన్స్‌లో సింహాద్రి గురించి మాట్లాడిన రాజమౌళి
ఫ్రాన్స్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి 'సింహాద్రి' సినిమాలోని కీలక సన్నివేశం వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భూమిక తండ్రి పాత్రను హీరో చంపే సన్నివేశాన్ని కుటుంబ సభ్యులు, క్రియేటివ్ టీమ్ వ్యతిరేకించినా, అదే కథకు ప్రాణమని నమ్మి తెరకెక్కించానన్నారు. చివరకు ఆ ఎమోషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని 'సింహాద్రి'ని ఇండస్ట్రీ హిట్‌గా నిలిపిందని గుర్తు చేశారు.
ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా వారణాసి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు రాజమౌళి. వేదిక ఏదైనా దాన్ని మహేష్ మూవీ ప్రమోషన్స్ కోసమే వాడేస్తున్నారు. కానీ రీసెంట్‌గా ఫ్రాన్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, మరో మూవీ గురించి మాట్లాడారు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఓ సినిమాలో సీన్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఏంటా మూవీ, ఇప్పటికీ డిస్కస్ చేసేంతగా ఆ సీన్‌లో ఏముంది..? సింహాద్రి మూవీ అనగానే అందరికీ గుర్తొచ్చేది తారక్ మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ ఎమోషన్. జక్కన్న కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి జూనియర్ ఎన్టీఆర్‌ను టాప్ స్టార్‌గా నిలబెట్టింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ విషయంలో జక్కన్నకు తన ఫ్యామిలీతో పాటు, క్రియేటివ్ టీమ్‌తో పెద్ద గొడవే జరిగిందట. ఓ మంచి వాడిని హీరో చంపే సీన్ విషయంలో జరిగిన ఆ డిస్కషన్స్ గురించి రీసెంట్ ఇంటరాక్షన్‌లో రివీల్ చేశారు రాజమౌళి. సినిమాలో హీరోయిన్ భూమిక తండ్రి అయిన భానుచందర్ మంచివాడైనా.. ఓ సీన్‌లో హీరో అతన్ని కాల్చి చంపాల్సి వస్తుంది. తన కథలన్నీ కుటుంబ సభ్యులతోనే చర్చించి లాక్ చేసే రాజమౌళికి ఈ సీన్ దగ్గరే అభ్యంతరం ఎదురైంది. ఒక మంచి వ్యక్తిని హీరో చంపితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి. కానీ ఆ ఒక్క సీనే సినిమాకు ప్రాణమని, ఆ ఎమోషన్ వర్కవుట్ అయితే కథ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని రాజమౌళి బలంగా నమ్మారు. అందుకే యూనిట్ అంతా నో చెప్పినా… తాను అనుకున్నట్టుగానే ఆ సీన్‌ను తెరకెక్కించారు. రాజమౌళి పట్టిన పంతం, ఆయన విజన్ ఏమాత్రం వృధా పోలేదు. ఆయన టీమ్ భయపడినట్లుగా ప్రేక్షకులు ఆ సీన్‌ను రిజెక్ట్ చేయలేదు. ఆ ఎమోషన్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. దర్శకుడిగా జక్కన్న నమ్మకమే నిజమైంది, సింహాద్రి ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా రికార్డులు క్రియేట్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

