AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ తర్వాత కోలీవుడ్‌కు వారసుడు ఎవరు?.. స్టార్ రేసులో హాట్ డిబేట్!

విజయ్ తర్వాత కోలీవుడ్‌కు వారసుడు ఎవరు?.. స్టార్ రేసులో హాట్ డిబేట్!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 25, 2026 | 8:30 AM

Share

విజయ్ సినిమాలకు వీడ్కోలు చెప్పడంతో కోలీవుడ్‌లో స్టార్ పవర్‌పై కొత్త చర్చ మొదలైంది. అజిత్ రేసింగ్‌పై దృష్టి పెట్టగా, సీనియర్ స్టార్లు నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. విక్రమ్, ధనుష్ ఆశించిన స్థాయిలో వరుస విజయాలు అందుకోలేకపోతుండగా, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి ఇంకా టాప్ రేసులోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో సూర్యే కోలీవుడ్ తదుపరి అగ్రస్థానాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కోలీవుడ్ కల తప్పుతుందా..? ప్రజెంట్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఇదే డిస్కషన్‌ జరుగుతోంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా… సీనియర్స్‌ సైడ్ అవుతుంటే..? ఆ తరువాత జనరేషన్‌ ఆ ప్లేస్‌ను ఫిల్ చేస్తుంటారు. కానీ తమిళనాట అలాంటి సిచ్యుయేషన్‌ కనిపించటం లేదు. స్టార్స్ సైడ్ అవుతున్నా… ఆ ప్లేస్‌ను కవర్‌ చేసే నెక్ట్స్ జనరేషన్‌ కనిపించటం లేదు. విజయ్‌ ఆఖరి సినిమా జన నాయగన్‌ రిలీజ్‌ సందర్భంగా మరోసారి కోలీవుడ్ సిచ్యుయేషన్ మీద డిస్కషన్ మొదలైంది. కోలీవుడ్‌లో ఈ జనరేషన్‌ సూపర్ స్టార్స్ అనుకున్న హీరోలంతా ఇప్పుడు సైడ్ అవుతున్నారు. విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. ఆయన ఆఖరి సినిమా జన నాయగన్‌ ఆడియన్స్‌ ముందుకు వచ్చేసింది. అజిత్‌ యాక్టింగ్‌ కన్నా రేసింగ్ మీదే ఎక్కువగా కాన్సన్‌ ట్రేట్ చేస్తున్నారు. దీంతో కోలీవుడ్‌లో మాస్‌ క్రౌడ్‌ పుల్లర్స్‌ కరవైపోతున్నారు. ఈ ఎఫెక్ట్‌ బాక్సాఫీస్ దగ్గర భారీగానే కనిపిస్తోంది. స్టార్ హీరోలు బ్రేక్ తీసుకున్నా, కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ మాత్రం వరుస సినిమాలతో బాక్సాఫీస్ కల తప్పుకుండా చూసుకుంటారని భావించారు ఫ్యాన్స్‌. ఆ మధ్య సీనియర్ల కాంపౌండ్ నుంచి వరుస ఎనౌన్స్‌మెంట్స్ రావటంతో ఆడియన్స్‌లో హైప్ పెంచింది. కానీ ఇప్పుడు సీనియర్లు కూడా స్లో అయ్యారు. ఆల్రెడీ ఎనౌన్స్‌ అయినా సినిమాల విషయంలోనే నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. విక్రమ్, ధనుష్‌ లాంటి లాంటి హీరోలైనా బాక్సాఫీస్‌ దగ్గర సందడి క్రియేట్ చేస్తారనుకుంటే, ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు. ఈ హీరోలు వరుస సక్సెస్‌లు ఇవ్వటంలో తడబడుతున్నారు. శివ కార్తికేయన్‌, విజయ్‌ సేతుపతి లాంటి స్టార్స్‌ బిగ్ హిట్స్ ఇస్తున్నా… ఇంకా నెంబర్‌ గేమ్‌లోకి రాలేదు. మిగతా హీరోలతో పోలిస్తే సూర్య కాస్త మంచి పొజిషన్‌లో ఉన్నారు. రీసెంట్‌గా బ్లాక్ బస్టర్‌తో సత్తా చాటి బాక్సాఫీష్‌ ఫ్యూచర్ మీద ఆశలు కల్పించారు. దీంతో నెక్ట్స్ టాప్ హీరో ఆయనే అవుతారంటున్నారు ఫ్యాన్స్‌. మరి విజయ్‌ ఎగ్జిట్‌తో క్రియేట్‌ అయిన గ్యాప్‌ను ఏ స్టార్ హీరో క్యాష్ చేసుకుంటారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Follow Us