రామానుజన్ ముని మనవరాలే ఈ టాలీవుడ్ హీరోయిన్! మీకు  తెలుసా ?

24-07-2026

Pic credit - Instagram

Phani Ch

భారతీయ గణిత రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన మహనీయుడు శ్రీనివాస రామానుజన్. అలాంటి గొప్ప మేధావి కుటుంబానికి చెందిన ఈ హీరోయిన్‌కు మధ్య ఉన్న బంధం నెట్టింట వైరల్ అవుతుంది.

చదువుతో పాటు గ్లామర్ ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్ర వేసిన ఆ నటి మరెవరో కాదు.. కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్.

ప్రీతి ముకుందన్ అమ్మ తరపు బంధుత్వంలో మ్యాథమెటీషియన్ శ్రీనివాస రామానుజన్‌కు స్వయానా ముని మనవరాలు అవుతారు. అంటే రామానుజన్ గారు ఆమెకు ముత్తాత వరుస అవుతారన్నమాట!

కేవలం రామానుజన్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన ప్రముఖ గిటార్ విద్వాంసుడు 'గిటార్ ప్రసన్న' కూడా ప్రీతి ముకుందన్‌కు సొంత మేనమామ కావడం మరో విశేషం

ఇలాంటి గొప్ప మేధావులు, దిగ్గజ కళాకారుల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ప్రీతి, చదువులోనూ ఎంతో ప్రతిభ చూపిస్తూనే చిన్నతనం నుంచే కళారంగం వైపు తన అడుగులు వేసింది.

తన కెరీర్‌ను మోడలింగ్ మరియు ప్రముఖ మ్యూజిక్ వీడియోలతో ప్రారంభించిన ప్రీతి, తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించి పలు భాషల్లో మంచి అవకాశాలు దక్కించుకుంది.

 విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి పాన్ ఇండియా స్టార్స్‌తో కలిసి నటించే అరుదైన అవకాశం ఈ ముద్దుగుమ్మకు లభించడం విశేషం.