AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ నెంబర్లను వాడటం ఎలా..? ఈ ప్రాసెస్ ఫాలో అయితే సింపుల్..

వాట్సప్ ప్రతీఒక్కరూ రోజూ ఒక్కసారైనా వాడుతూ ఉంటారు. వ్యక్తిగత అవసరాల కోసమో లేదా వ్యాపార, ఉద్యోగ అవసరాల కోసమో వినియోగిస్తూ ఉంటారు. అయితే వేర్వేరు అవసరాల కోసం వేర్వేరు నెంబర్లపై వాట్సప్ అకౌంట్లను వాడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లను ఎలా వాడాలంటే..

Venkatrao Lella
|

Updated on: Jul 25, 2026 | 9:37 AM

Share
స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్లలో వాట్సప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే కొంతమంది వేర్వేరు అవసరాల కోసం రెండు వాట్సప్ నెంబర్లు వాడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో రెండు అకౌంట్లను నిర్వహించడం కష్టతరంగా మారుతుంది. దీంతో వాట్సప్ అద్బుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. ఒకే వాట్సప్ యాప్‌లో రెండు వాట్సప్ నెంబర్లతో అకౌంట్లను నిర్వహించుకోవచ్చు.  ఇది ఎలా వాడాలనేది చూద్దాం.

1 / 5
వాట్సాప్ మల్టీ-అకౌంట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లను ఉపయోగించుకోవచ్చు. గతంలో ఒక నెంబర్‌పై లాగిన్ అయిన తర్వాత వేరే నెంబర్‌పై వాట్సప్ వాడాలంటే లాగౌట్ అవ్వాల్సి వచ్చేది. లేదా సాధారణ వాట్సప్ యాప్‌లో ఒక నెంబర్.. వాట్సప్ బిజినెస్‌లో యాప్‌లో మరో నెంబర్‌పై లాగిన్ అయ్యి ఉపయోగించుకునేవారు. ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఒకే యాప్‌లో రెండు వాట్సప్ అకౌంట్లను ఉపయోగించుకునేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది

2 / 5
ఆండ్రాయిడ్‌తో పాటు iOS వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఎప్పటినుంచో ఈ ఫీచర్ ఉంది.  ఈ ఫీచర్ ఎలా వాడాలంటే.. వాట్సప్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. మీ ప్రొఫైల్ లేదా ఫొటో కనిపించే చోట పక్కన ఉన్న బాణం గుర్తును నొక్కాలి. అనంతరం అకౌంట్‌ను జోడించు అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రెండో ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి ధృవీకరించాలి.

3 / 5
అనంతరం రెండో అకౌంట్ ప్రొఫైల్‌ను పూర్తి చేసి సెక్యూరిటీ, నోటిఫికేషన్స్ సెట్టింగ్స్‌ను పరిశీలించుకోవాలి. దీంతో సెటప్ పూర్తవుతుంది. ఒకవేళ మీరు ఇదే అకౌంట్ నుంచి వేరే నెంబర్‌కు మారాలంటే స్విచ్చ్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ ఫీచర్ కనిపించపోతే గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాట్సప్ యాప్ అప్డేట్ చేసుకోండి.

4 / 5
అయినా కూడా ఆ ఆప్షన్ కనిపించకపోతే.. ఆ ఫీచర్ ఇంకా ఆ డివైజ్ లేదా అకౌంట్ కోసం ఎనేబుల్ చేయబడి ఉండకపోవచ్చు. సపోర్ట్ చేసే ఫోన్‌లలో వినియోగదారులు ప్రత్యామ్నాయంగా అధికారిక వాట్సాప్ బిజినెస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి రెండో నంబర్‌తో దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు.

5 / 5
Follow Us