AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: శ్రుతి సోషల్ మీడియా అకౌంట్‌లో అలాంటి పోస్టులు.. షాకవుతోన్న అభిమానులు.. హీరోయిన్ క్లారిటీ

ఇటీవల సినిమా తారల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవ్వడం పరిపాటిగా మారింది. తాజాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ట్విట్టర్ అకౌంట్ ను కూడా ఎవరో హ్యాక్ చేశారు. అంతేకాదు శ్రుతికి ఏ మాత్రం సంబంధం లేని పోస్టులు అందులో షేర్ చేశారు.

Shruti Haasan: శ్రుతి సోషల్ మీడియా అకౌంట్‌లో అలాంటి పోస్టులు.. షాకవుతోన్న అభిమానులు.. హీరోయిన్ క్లారిటీ
Actress Shruti Haasan
Basha Shek
|

Updated on: Jun 24, 2025 | 7:48 PM

Share

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుందీ అందాల తార. అలాగే తన లేటెస్ట్ ఫొటోస్ వీడియోలను కూడా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పంచుకుంటుంది. అయితే తాజాగా శ్రుతి హాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఆమె అకౌంట్ నుంచి బిట్‌కాయిన్‌, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. మావెరిక్స్ యజమాని – మార్క్ క్యూబన్ పేరుతో ఈ ట్వీట్స్‌ పోస్ట్ లు చేశారు. శ్రుతి ఖాతా నుంచి వరుసగా ఇలాంటి సందేశాలు రావడంతో అభిమానులు సైతం షాకయ్యారు. దీంతో తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఇన్ స్టా గ్రామ్ వేదికగా వెల్లడించింది శ్రుతి. దయచేసి ఎవరూ కూడా ఆ మేసేజ్‌లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేసింది. ‘‘హాయ్ లవ్లీస్ నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అవి నేను పోస్ట్ చేయడం లేదు. కాబట్టి నేను తిరిగి అకౌంట్ రికవర్ చేసుకునే వరకు దయచేసి ఆ పేజీలో చాట్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ ఎమోజీతో పాటు హార్ట్ సింబల్ షేర్ చేసింది శ్రుతి.

శృతి హాసన్ సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. మళ్లీ ఇప్పుడిలా ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో నిత్యం శృతి అకౌంట్‌ను హ్యాక్ చేస్తున్నది ఎవరా అని నెటిజన్లు సైతం ఆలోచనలో పడ్డారు.

ఇవి కూడా చదవండి

శ్రుతి హాసన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. రీ ఎంట్రీలో శ్రుతి హాసన్ అదరగొడుతోంది. వకీల్ సాబ్, క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్-1.. ఇలా బ్యాక్ బు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉందీ అందాల తార. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్- రజనీ కాంత్ కాంబోలో వస్తోన్న కూలీ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలోనూ హీరోయిన్ యాక్ట్ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..