AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: భర్త చనిపోయినా మెడలో మంగళసూత్రంతో కనిపించిన టాలీవుడ్ నటి.. కారణం తెలిస్తే కన్నీళ్లాగవు

మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్య మెడలో తాళి బొట్టు తీసేయడం ఒక ఆనవాయితీ. అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తన భర్త చనిపోయి దాదాపు 12 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ మెడలో మంగళసూత్రంతోనే కనిపిస్తోంది.

Tollywood: భర్త చనిపోయినా మెడలో మంగళసూత్రంతో కనిపించిన టాలీవుడ్ నటి.. కారణం తెలిస్తే కన్నీళ్లాగవు
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 24, 2025 | 7:11 PM

Share

ఈ టాలీవుడ్ నటి ఒకప్పుడు కుర్రాళ్ల కలల సుందరి. తెలుగుతో పాటు కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, ఒడియా భాషల్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించింది. తనదైన అందం, అభినయం వీటికి మించి తన హుషారెత్తించే డ్యాన్స్ లతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. 198-90వ దశకంలో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ అందాల తార దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ ను తగ్గట్టుగా డ్యాన్స్ లు చేసి ప్రశంసలు అందుకుంది. కేవలం స్పెషల్ సాంగ్స్ కే పరిమితమైన ఈ అందాల తార నటిగా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే సినిమా కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఓ టాలీవుడ్ ఫేమస్ నటుడిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎంతో సరదాగా సాగిపోతోన్న ఈ అందాల తార జీవితం కొన్నేళ్ల క్రితం ఒక్కసారిగా పెను కుదుపునకు గురైంది. స్టార్ నటుడిగా వెలుగొందుతోన్న ఆమె భర్త హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో ఈ నటి తల్లడిల్లిపోయింది.

భర్త మరణం నుంచి కొన్నేళ్ల పాటు తేరుకోలేకపోయిందీ అందాల తార. ఒకానొక సమయంలో భర్తను మర్చిపోలేక తాగుడుకు కూడా బానిస అయ్యిందని ప్రచారం జరిగింది. అయితే తన బిడ్డలకు బంగారు భవిష్యత్ ను అందించేందుకు మళ్లీ మాములు మనిషిగా మారిపోయింది. అనకున్నట్లే తన కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కానీ తన భర్త పంచిన ప్రేమను మాత్రం మర్చిపోలేకుంది. అందుకే అతను చనిపోయి పుష్కర కాలం గడుస్తున్నాభర్త కట్టిన తాళి బొట్టును మెడలో అలాగే ఉంచుకుంది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి.

పిల్లలతో నటి డిస్కో శాంతి..

ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైన డిస్కో శాంతి మెడలో మంగళసూత్రాలతో కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తన తాళిబొట్టును చూపిస్తూ.. ‘ఇది నా బావ తన ప్రేమకు గుర్తుగా నాకు కట్టింది. ఆయన ప్రస్తుతం నా తో లేకపోయినా, కట్టిన తాళి నా మెడలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మంగళసూత్రం అలాగే వేసుకున్నాను. బావ తన మెడలో వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా వేసుకుంటారు దానిని కూడా నేను మంగళ సూత్రంలోనే వేసుకున్నాను. ఈ తాళిబొట్టును మా బావ ప్రేమకు గుర్తుగా ఉన్నించుకున్నాను. ఎవరైనా దీనిపైన చేయి వేస్తే చంపేస్తాను’ అని చెప్పుకొచ్చింది డిస్కో శాంతి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భర్తపై తనకున్న ప్రేమను డిస్కో శాంతి ఇలా చూపిస్తుందంటూ నెటిజన్లు నటిని మెచ్చుకుంటున్నారు.

Disco Shanthi

Disco Shanthi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.