అందాల హన్సిక సినిమాలకు దూరం అవుతుందా.?  

Rajeev 

25  February 2026

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు హాన్సిక మోత్వాని. దక్షిణాదిలో అత్యంత గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఆమె ఒకరు.

బాలనటిగా తెరంగేట్రం చేసిన హాన్సిక.. ఆ తర్వాత కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఫస్ట్ మూవీలోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

డిసెంబర్ 2022లో జైపూర్‌లోని ముండోటా కోటలో తన స్నేహితుడు సోహైల్ కతురియాను వివాహం చేసుకుంది.

ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న హాన్సిక.. బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు పేరు తెరపైకి వచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.