AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు చూస్తే బుర్రపాడు.. క్లైమాక్స్ మాత్రం..

ఓటీటీలో ఈమధ్య కాలంలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ మూవీస్, వెబ్ సిరీస్ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇాలంటి జానర్ కథలపై అడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపించడంతో మేకర్స్ సైతం ఈ తరహా చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసా.. ? ఇటీవల ఓటీటీని ఊపేసిన థ్రిల్లర్ మూవీ..

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు చూస్తే బుర్రపాడు.. క్లైమాక్స్ మాత్రం..
Identity Movie
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2025 | 7:37 AM

Share

ఓటీటీలో ఈమధ్య కాలంలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ మూవీస్, వెబ్ సిరీస్ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇాలంటి జానర్ కథలపై అడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపించడంతో మేకర్స్ సైతం ఈ తరహా చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసా.. ? ఇటీవల ఓటీటీని ఊపేసిన థ్రిల్లర్ మూవీ..మీకు క్రైమ్-థ్రిల్లర్ సినిమాలను చూడడం ఇష్టమా.. ? అయితే మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఏడాదిలో విడుదలైన ఈ సినిమా మొదటి నిమిషం నుండే ఉత్కంఠ మొదలవుతుంది. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ ఉత్కంఠగానే సాగుతుంది. అలాగే ఆద్యంతం చివరి వరకు చూడాలనే ఉత్సుకతను ప్రేరేపిస్తుంది. ఆ సినిమా పేరు ‘ఐడెంటిటీ’. మలయాళ భాషలో నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. ఇందులో టోవినో థామస్, త్రిష కృష్ణన్, మందిరా బేడి, అజు వర్గీస్, గోపికా రమేష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఒక హత్యతో ఈ మూవీ స్టోరీ మొదలవుతుంది. కథ విషయానికి వస్తే.. ఒక వ్యక్తిని పాత గిడ్డంగిలో చంపి సజీవ దహనం చేస్తారు. ఆ తర్వాత పోలీసులు ఆ హత్య కేసును దర్యాప్తు ప్రారంభిస్తారు.

ఇందులో టోవినో థామస్ స్కెచ్ ఆర్టిస్ట్ హరన్ శంకర్ పాత్రను పోషించాడు. అతడు గొప్ప స్కెచ్ ఆర్టిస్ట్. పోలీసులు అతనిని కూడా తమ దర్యాప్తులో చేర్చుకుంటారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హత్యకు ఏకైక సాక్షి అయిన అలీషా పాత్రలో కనిపించింది. కానీ ఆమె కొంతవరకు జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. ఇక ఈ సినిమా కథ ముందుకు సాగుతున్న కొద్దీ అనేక షాకింగ్ విషయాలు బయటపడతాయి. అనుక్షణం ఊహించని మలుపులతో ఉంటుంది.

ముఖ్యంగా క్లైమాక్స్ చూసి మీరు షాకవుతారు. దాదాపు 2 గంటల 36 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా మీకు ఆద్యంతం ఊహించని థ్రిల్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టిస్తోంది. మొదట్లో ఈ సినిమా దేశంలో టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో ఉండేది. ఈ చిత్రానికి అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి IMDbలో 10కి 7.2 రేటింగ్ లభించింది.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..