Viral Video: బేసిక్ కామన్‌సెన్స్ లేదు.. ఆమె వద్దు అని చెప్తున్నా…
ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్న ట్రావెల్ వ్లాగర్ ఇనెస్ ఫారియా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను వివరించింది. రెండు నెలల పాటు ఇండియాలో గడిపిన సమయంలో తాను ఇలాంటి ప్రవర్తనను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే ...?

ముంబైలో పోర్చుగల్ మహిళను ఇబ్బందులకు గురి చేశారు పోకిరీలు. భారత్‌లో పర్యటించడానికి వచ్చిన విదేశీ మహిళను.. సెల్ఫీ ఇవ్వాలంటూ అదే పనిగా వెంటపడ్డారు ఇద్దరు యువకులు. ఆమె వారిస్తున్నప్పటికీ.. పదే పదే ఆమె సమీపంగా తిరుగుతూ ఇబ్బందులకు గురిచేశారు. ట్రావెలర్ అయిన ఆ మహిళ.. వీడియో ద్వారా వేధింపులను బయటపెట్టింది. సెల్ఫీ, ఫొటో పేరుతో వెంటబడుతూ ఆమెకి వేధించారు ఇద్దరు యువకులు. ఆమె..పదే పదే హెచ్చరిస్తున్నా.. అదే పనిగా వేధిస్తూ వెనకే తిరిగారు ఆ పోకిరీలు. ఈ ఘటనపై ముంబై అగ్రిపాడ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మూడు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి యాక్షన్‌లోకి దిగారు ముంబై పోలీసులు. వీడియోలో కనిపించిన ఆ ఇద్దరు యువకుల కోసం గాలింపు మొదలుపెట్టారు. త్వరలోనే వాళ్లను పట్టుకుని చర్యలు తీసుకుంటామన్నారు ముంబై అగ్రిపాడ పోలీసులు. నిందితులను ట్రేస్ చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించినట్టు తెలిపారు.
‘ఇండియాలో నాకు ఇలాంటి అనుభవం రావడం ఇదే మొదటిసారి.. ఇక్కడికి వచ్చి రెండు నెలలు అయ్యింది. ఇప్పటివరకు నా అనుభవాలు చాలా అందమైనవి, ఆప్యాయతతో నిండినవి. మంచి ఆతిథ్యంతో కూడినవి. కానీ ఆ రోజు మాత్రం భిన్నంగా అనిపించింది. నేను పలుమార్లు వద్దు అని చెప్పినా కూడా వారు ఫోటోలు తీసుకుంటామని వెంటపడ్డారు. నాకు అసౌకర్యంగా అనిపించింది. దాదాపు 15 నిమిషాల పాటు నన్ను వెంబడిస్తూ ఉండటంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఒక దశలో నేను స్వయానా వారిని వెనక్కి తోయాల్సి వచ్చింది. వద్దు అంటే.. అది పూర్తిస్థాయి సమాధానం అన్న విషయాన్ని తెలుసుకోవాలి. భద్రత, సౌకర్యం ఎప్పుడూ ముందు వరసలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి’ అని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
View this post on Instagram
