AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లివే.. ఈ రెండు మూవీస్ మిస్ అవ్వద్దు

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 27) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మరి ఈ వీకెండ్ లో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు ఉన్నాయో తెలుసుకుందాం రండి.

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లివే.. ఈ రెండు మూవీస్ మిస్ అవ్వద్దు
OTT Movies
Basha Shek
|

Updated on: Feb 28, 2026 | 6:55 AM

Share

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగానే శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. అయితే అందులో పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ అవ్వలేదు. కేవలం శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం మూవీపైనే ఆడియన్స్‌లో కాస్తా బజ్‌ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా ‘ఉత్తుత్త హీరోలు’, ‘సన్నాఫ్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.మరోవైపు ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నవీన్ చంద్ర నటించిన హనీ గురించి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. అలాగే మరో తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. వీటితో పాటు అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ, బాలీవుడ్, హాలీవుడ్‌ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సైతం ఈ వీకెండ్ ఓటీటీల్లో అలరించనున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్

  • అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇవి కూడా చదవండి
  • హనీ(తెలుగు సినిమా)
  • ద సీఈఓ క్లబ్ (ఇంగ్లిష్ సిరీస్)
  • పాల్ మెక్‌కర్ట్‌నే (ఇంగ్లిష్ సినిమా)
  • ద బ్లఫ్ (ఇంగ్లిష్ సినిమా)
  • ఇక్కీస్ (హిందీ మూవీ)

జియో హాట్‌స్టార్

  • రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్)
  • ప్యారడైజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
  • వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ (ఇంగ్లిష్ సినిమా)
  • సంగ్ మర్మర్ (హిందీ వెబ్ సిరీస్)
  • బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లిష్ సినిమా)
  • బుగోనియా (ఇంగ్లిష్ మూవీ)

జీ5

  • డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు వెబ్ సిరీస్)
  • తడయమ్ (తమిళ వెబ్ సిరీస్)
  • క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా)
  • అబార్‌ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)
  • అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో)

ఆహా

  • హాట్‌స్పాట్ 2 మచ్‌ (తెలుగు డబ్బింగ్ సినిమా)
  • సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో)

సన్ నెక్స్ట్

  • హనీ (తెలుగు సినిమా)
  • నీలి హక్కీ (కన్నడ మూవీ)

ఆపిల్ టీవీ ప్లస్

  • మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us