AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..

గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..

Phani CH
|

Updated on: Feb 27, 2026 | 9:02 PM

Share

సాధారణంగా మనం ఆన్‌లైన్ లో ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే, డెలివరీ బాయ్ బైక్‌ మీదో లేదా స్కూటర్ మీదో వేగంగా వచ్చి డెలివరీ చేస్తుంటాడు. అప్పుడప్పుడు పర్యావరణం కోసం కొందరు సైకిళ్లపై వచ్చి ఫుడ్ డెలివరీ చేసిన ఘటనలు కూడా మనం చూశాం. అయితే రాజస్థాన్‌లో మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వింత దృశ్యం కంటపడింది. ఎవరూ ఊహించని విధంగా ఓ వృద్ధుడు ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లి బ్లింకిట్ వస్తువుల్ని డెలివరీ చేసి వార్తల్లో నిలిచారు.

సాధారణంగా మనం ఆన్‌లైన్ లో ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే, డెలివరీ బాయ్ బైక్‌ మీదో లేదా స్కూటర్ మీదో వేగంగా వచ్చి డెలివరీ చేస్తుంటాడు. అప్పుడప్పుడు పర్యావరణం కోసం కొందరు సైకిళ్లపై వచ్చి ఫుడ్ డెలివరీ చేసిన ఘటనలు కూడా మనం చూశాం. అయితే రాజస్థాన్‌లో మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వింత దృశ్యం కంటపడింది. ఎవరూ ఊహించని విధంగా ఓ వృద్ధుడు ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లి బ్లింకిట్ వస్తువుల్ని డెలివరీ చేసి వార్తల్లో నిలిచారు. టెక్నాలజీ యుగంలో ఇలాంటి వింటేజ్ డెలివరీని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. రాజస్థానీ సంస్కృతికి అద్దం పట్టేలా ఉన్న ఈ విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌లతో సంబంధం లేకుండా గుర్రంపై గాల్లో తేలినట్లు వెళ్తున్న ఆ వృద్ధుడి వేగం చూస్తుంటే ముచ్చటేస్తోంది. పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో ఇదొక కొత్త ఐడియాలా ఉందంటూ కొందరు చర్చించుకుంటున్నారు. ‘రాజస్థాన్‌లో ‘రాయల్’ సర్వీస్! ఓ పెద్దాయన గుర్రంపై స్వారీ చేస్తూ ఆన్‌లైన్ డెలివరీ చేస్తున్నారు’ అని ఆ వైరల్ వీడియోకు నెటిజన్లు కాప్షన్‌ జోడించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. తలకు సాంప్రదాయ పాగా కట్టుకున్న ఒక వృద్ధుడు నల్లటి గుర్రంపై రోడ్డు మీద అత్యంత వేగంగా స్వారీ చేస్తూ కనిపిస్తున్నాడు. ఆ వృద్ధుడి భుజానికి ప్రముఖ డెలివరీ సంస్థ ‘బ్లింకిట్’ బ్యాగ్ వేలాడుతుండటం విశేషం. అయితే ఆ పెద్దాయన నిజంగానే ఆ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడా? లేదా సరదాగా బ్యాగ్ తగిలించుకున్నాడా? అనటానికి అధికారిక ఆధారాలు ఏవీ లేవు. సంస్థ కూడా ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ, ఆ బ్యాగ్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా రాజస్థాన్ ఇసుక తిన్నెల్లో బైక్ వెళ్లలేని చోటుకు ఇలా చేరుకుంటున్నారేమో అని కొందరు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఇది కేవలం ఫోటో షూట్ కోసం చేసినా, ఆ వృద్ధుడి స్వారీ నైపుణ్యం మాత్రం అద్భుతంగా ఉంది. నేటితరం కుర్రాళ్లు బైక్ స్టంట్లు చేస్తుంటే, ఈయన గుర్రంతో చేస్తున్న విన్యాసం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ.. ‘ఇదే గనుక నిజం అయితే.. ఆ వయసులో ఆయన పడుతున్న కష్టానికి సెల్యూట్ చేయాలి. ఆయన ఈ ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శం’ అంటూ ప్రశంసిస్తున్నారు. ‘కుటుంబ పోషణ కోసం ఈ వయసులో కూడా ఇంత సాహసోపేతంగా కష్టపడేవాళ్లు చాలా మందే ఉన్నారు. వారు మన సమాజానికి నిజమైన హీరోలు’ అని మరికొందరు రాసుకొచ్చారు. ‘ఇలాంటి రాయల్ డెలివరీలు నేనెప్పుడూ చూడలేదు.. ఇవన్నీ కేవలం అద్భుతాల నిలయమైన ఇండియాలో మాత్రమే జరుగుతాయి’ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. కొందరైతే “దీనినే హార్స్ పవర్ డెలివరీ అంటారు” అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పని పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను చూసి యువత నేర్చుకోవాల్సింది చాలా ఉందని వారు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

EPFO: వాడని పీఎఫ్‌ ఖాతాల్లోని డబ్బులు వాపస్‌

వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు

ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..

Ram Charan: మాలతో చరణ్‌ పార్టీకి వెళ్లడంపై వివాదం !! శిరీష్‌ క్లారిటీ

Vijay-Rashmika Marriage: ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే.. అందుకే కలిశారేమో..

Follow Us