వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒకే రాత్రి నాలుగు దుకాణాల షట్టర్లను పగలగొట్టి దొంగతనం చేసిన నిందితుడు కలకలం రేపాడు. తాళాలు పగలగొట్టడంలో అతడి నైపుణ్యం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో నమోదైన ఈ దృశ్యాలు వ్యాపారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
దొంగల్లో రకాలు ఉంటారు.. ఇతగాడు తాళాలు పగలగొట్టడంలో స్పెషలిస్ట్. తాళాలను ఐస్ గడ్డల్లా పగలగొట్టేస్తున్నాడు. ఒక్క రాత్రిలోనే వరుసగా నాలుగు షాపుల షట్టర్లను బద్ధలు కొట్టి వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న ఈ వరుస చోరీల ఉదంతం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ కేటుగాడు పక్కా ప్లాన్‌తో షట్టర్లను టార్గెట్ చేస్తున్నాడు. జంగారెడ్డిగూడెంలో ఒకే రాత్రి నాలుగు దుకాణాల తాళాలు పగలగొట్టిన నిందితుడు, సుమారు రూ. 5 వేల నగదును అపహరించాడు. డబ్బు తక్కువే అయినా, అతను షట్టర్లను బద్ధలు కొట్టిన తీరు చూసి పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. తాళాలను పగలగొట్టడంలో అతను ప్రదర్శించిన వేగం, నైపుణ్యం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పట్టణంలోని వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. ఎంతటి పటిష్టమైన తాళాలు వేసినా, నిమిషాల వ్యవధిలో వాటిని ధ్వంసం చేస్తున్న ఈ ‘షట్టర్ బ్రేకర్’ ఎప్పుడు ఎవరి షాపుపై పడతాడో అని ఆందోళన చెందుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు విచారణాధికారులు. నిందితుడు పాత నేరస్థుడా లేక కొత్తగా ఈ తరహా చోరీలకు అలవాటు పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని, సీసీటీవీలు లేని చోట వెంటనే ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
Ram Charan: మాలతో చరణ్ పార్టీకి వెళ్లడంపై వివాదం !! శిరీష్ క్లారిటీ
Vijay-Rashmika Marriage: ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే.. అందుకే కలిశారేమో..
Vijay-Rashmika Marriage: కట్టా- మీటా లాంటి లవ్ స్టోరీ.. ఎన్ని స్టేజ్‌లు దాటారంటే ??
Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు

