AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Plaza: ఇక ఆగాల్సిన అవసరమే లేదు.. గేట్లు లేని టోల్‌ ప్లాజాలు..!

Toll Plaza: ప్రస్తుతం హైవే గుండా వెళ్తుంటే టోల్‌ ప్లాజా రాగానే కొన్ని సెకన్లపాటు ఆగాల్సి ఉండేది. అది కూడా పాస్టాగ్‌ ఉంటే. కాని ఇప్పుడు ఆది కూడా ఆగాల్సిన అవసరం లేని సదుపాయం కూడా రాబోతోంది. మల్టీ లేన్‌ ఫ్రీ ఫ్లో..

Toll Plaza: ఇక ఆగాల్సిన అవసరమే లేదు.. గేట్లు లేని టోల్‌ ప్లాజాలు..!
Toll Plaza
Subhash Goud
|

Updated on: Feb 28, 2026 | 7:14 AM

Share

Toll Plaza: భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రజలకు ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయనున్న విషయం తెలిసిందే. అయితే మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారు.

ప్రస్తుతం హైవే గుండా వెళ్తుంటే టోల్‌ ప్లాజా రాగానే కొన్ని సెకన్లపాటు ఆగాల్సి ఉండేది. అది కూడా పాస్టాగ్‌ ఉంటే. కాని ఇప్పుడు ఆది కూడా ఆగాల్సిన అవసరం లేని సదుపాయం కూడా రాబోతోంది. మల్టీ లేన్‌ ఫ్రీ ఫ్లో (ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్‌) విధానాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) త్వరలో అమలు చేయనుంది. ఈ కొత్త విధానాన్ని కోల్‌కతా- చెన్నై హైవేలో విజయవాడ- గుంటూరు మధ్య ఉన్న కాజ టోల్‌ ప్లాజా, విజయవాడ బైపాస్‌లో వెంకటపాలెం వద్ద ఉండే టోల్‌ప్లాజాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇది కూడా  చదవండి: Gold Price Today: బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు!

ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు:

ఇక టోల్‌ గేట్ల వద్ద బారియర్స్‌ ఉండవు. టోల్‌గేట్ల వద్ద పైన శాటిలైట్‌ ఆధారిత జీపీఎస్, ఆర్‌ఎఫ్‌ఐడీ ఫాస్టాగ్‌ రీడర్, ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలు అమరుస్తారు. వాహనం టోల్‌ ప్లాజాకు వస్తుండగానే కొద్ది దూరంలోనే వాహనం నంబర్‌ ప్లేట్‌ను ఏఎన్‌పీఆర్‌ కెమెరా గుర్తిస్తుంది. ఆర్‌ఎఫ్‌ఐడీ ఫాస్టాగ్‌ రీడర్‌ ఆ వాహన ఫాస్టాగ్‌ను రీడ్‌ చేసి, టోల్‌ఫీజును వసూలు చేస్తుంది.

టోల్ ప్లాజాలోకి వచ్చేలోపే వాహనం స్కానింగ్:

ఇది టోల్‌ ప్లాజా వద్దకు వచ్చేలోనే వాహనాన్ని గుర్తించి ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో టోల్‌ వద్ద వాహనాన్ని కొన్ని సెకన్ల పాటు ఆపాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్‌ లేని వాహనాలు చివరి లైన్‌లో వెళ్లి, అక్కడ ఉండే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, యూపీఐ చెల్లింపు చేసి వెళ్లొచ్చు. దీనివల్ల టోల్‌ఫీజులో మరో 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ చెల్లింపు కాకుండా, నగదు చెల్లించేందుకూ అక్కడ ఏర్పాటు ఉంటుంది. కానీ టోల్‌ఫీజుకు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. టెక్నాలజీ పెరిగేకొద్ది వాహనదారులకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది.

ఇక కాజ టోల్‌ప్లాజాలో ప్రస్తుతం ప్రతి లైన్‌కు బూత్, బారియర్‌ ఉన్నాయి. మున్ముందు వీటిని తొలగించనున్నారు. విజయవాడ బైపాస్‌ మార్చి ఆఖరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక టోల్‌ వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us