Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఒకప్పుడు సినీరంగంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారులు ఇప్పుడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ముద్దుగుమ్మలు.. ఇప్పుడు మాత్రం వ్యాపార రంగాల్లో దూసుకుపోతున్నారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. ఇంతకీ ఈ అమ్మడు గుర్తుందా..? ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది.

తెలుగు సినిమా ప్రపంచంలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రా్లలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్ధార్థ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ అందమైన ప్రేమకథను కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించారు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఆయన.. దర్శకుడిగానూ సక్సెస్ అయ్యారు. 2005లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో శ్రీహరి, ప్రకాష్ రాజ్, జయ ప్రకాష్ రెడ్డి, అర్చన కీలకపాత్రలు పోషించగా.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అయ్యింది. ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు మరో అమ్మాయి రోల్ సైతం హైలెట్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుందా.. ?
అదెనండీ.. శ్రీహరి, త్రిష ఇంటోల పనిమనిషిగా కనిపించి జాగ్రత్త అంటే చాలు ఠక్కున చేతిలోని వస్తువులు కిందపడేసే అమ్మాయి పాత్రలో కనిపించింది. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. నిజానికి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచమయైన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆమె పేరు సంతోషి శ్రీకర్. తమిళనాడుకు చెందిన సీనియర్ నటి పూర్ణిమ కూతురు సంతోషి. అంతేకాదు.. సీనియర్ నటుడు ప్రసాద్ బాబు కోడలు ఆమె. నవదీప్ హీరోగా వచ్చిన జై సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సంతోషి. ఇందులో ఆమె హీరోయిన్ గా అందం, అభినయంతో ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఆ తర్వాత కథానాయికగా కాకుండా సహాయ పాత్రలు పోషించింది. తెలుగులో ఒక్కడే, బంగారం, ఢీ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తుంది. బోటిక్ అండ్ బ్యూటీ లాంగ్ పేరుతో కాస్మోటిక్స్, గ్లామర్ ప్రపంచంలో దూసుకుపోతుంది. మేకప్ క్లాసెస్, శారీ డ్రాపింగ్ తదితర ఫ్యాషన్ డిజైనింగ్ అంశాలకు సంబంధించి శిక్షణ కూడా ఇస్తోంది. ఆమెకు దక్షిణాదిలోని పలు ప్రధాన నగరాల్లో బ్రాంచ్ లు ఉన్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..




