AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఫ్యూచర్ ఇలా ఉంటుందా?  ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్

ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధ భయం అందరినీ వెంటాడుతోంది. ఇదే జరిగితే మానవాళి వినాశనానికి బీజం పడినట్టేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడివే పరిస్థితులను బేరీజుగా వేసుకుని ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

OTT Movie: మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఫ్యూచర్ ఇలా ఉంటుందా?  ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 23, 2025 | 2:43 PM

Share

ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు అందరినీ భయపెడుతున్నాయి. ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్న భావనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం తలెత్తితే మాత్రం పరిస్థితులు ఎవరూ ఊహించని విధంగా భయానకంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ క్రమంలో మూడవ ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మనుషులు ఎలా ఉంటారు? అన్న పరిస్థితులపై ఇటీవల ఒక సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఇచ్చింది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇటీవలే ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ మూవీలో చక్కగా చూపించారు. అందుకే ఈ మూవీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా స్టోరీలోకి వెళితే.. మూడో ప్రపంచ యుద్దం తర్వాత ఆహారం, నీళ్ల కోసం ప్రజలు కొట్టుకుంటారు. సమాజం రెసిడెంట్స్ (ధనవంతులు), లిబరేటర్స్ (పేద వాళ్లు)గా విడిపోతుంది. వీరిని కంట్రోల్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. మనుషులను చంపి వారి వద్ద నుంచి ఆహారం లాక్కునే మరో గ్రూప్ కూడా ఉంటుంది.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ భూమ్మీద ఒకచోట సేఫ్ హౌజ్ ఉందని తెలుస్తుంది. ఆ సేఫ్ హౌజ్‌ గురించి తెలిసిన శక్తి అక్కడే నివసిస్తుంటాడు.ఒక రోజు ఆ సేఫ్ హౌజ్‌లోకి భూమి అనే అమ్మాయి వస్తుంది. అదే సమయంలో రెసిడెంట్స్, లిబరేటర్స్ మధ్య పోరాటం తీవ్రమవుతుంది. రెసిడెంట్స్ ఉండే సేఫ్ హౌస్‌లో దాగి ఉన్న భయంకర నిజం బయటపడుతుంది.అసలు రెసిడెంట్స్ మనుషులను ఆహారంగా ఎందుకు తీసుకుంటున్నారు ? ఈ విషయం తెలుసుకున్న లిబరేటర్స్ ఏం చేశారు? చివరకు ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఈ స్కైఫై థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

సింప్లీ సౌత్ లో స్ట్రీమింగ్..

ఈ సినిమా పేరు కలియుగం 2064. శ్రద్ధా శ్రీనాధ్‌, కిశోర్‌ ప్రధానపాత్రల్లో నటించారు. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

కలియుగం- 2064 సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.