AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హైదరాబాద్‌లో సర్టిఫైడ్ జుంబా ఇన్‌స్ట్రక్టర్, డేటా అనలిస్ట్ ..ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?

ఈ అమ్మాయి మల్టీ ట్యాలెంటెడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో ఫేమస్ జుంబా ఇన్ స్ట్రక్టర్. అలాగే గ్లోబల్ డేటా రీసెర్చ్ సెంటర్ లో డేటా అనలిస్ట్ గా కూడా విధులు నిర్వర్తించింది. నటనపై మక్కువతో పలు యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీసుల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Tollywood: హైదరాబాద్‌లో సర్టిఫైడ్ జుంబా ఇన్‌స్ట్రక్టర్, డేటా అనలిస్ట్ ..ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 23, 2025 | 4:01 PM

Share

హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. సికింద్రాబాద్ లో స్కూలింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో బయెటెక్నాలజీలో ఎంటెక్ పట్టా అందుకుంది. చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్ లోని గ్లోబల్ డేటా రీసెర్చ్ సెంటర్ లా డేటా అనలిస్టుగా ఉద్యోగంలో చేరింది. అయితే చిన్నప్పటి నుంచే డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ భరత నాట్యం వంటి క్లాసికల్ డ్యాన్స్ తో పాటు బ్యాలెట్ వంటి వెస్ట్రన్ డ్యాన్స్ లో నైపుణ్యం సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోనే సర్టిఫైడ్ జుంబా ఇన్ స్ట్రక్టర్ గా ఎంతో మందికి డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చింది. ఇదే క్రమంలో యూట్యూబర్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడల్ గా పలు బ్రాండ్స్ కు సంబంధించిన యాడ్లలోనూ నటించింది. పలు ఫ్యాషన్ షోల్లోనూ ర్యాంప్ వాక్ కూడా చేసి ఆకట్టుకుంది. అలాగే పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించింది. ఇలా తన మల్టీ ట్యాలెంటెడ్ తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సడెన్ గా హీరోయిన్ గా మారింది. ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? విరాట పాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ వెబ్ సిరీస్ హీరోయిన్ అభిజ్ఞ వూతలూరు.

కృష్ణ పోలూరు తెరకెక్కించిన విరాట పాలెం వెబ్ సిరీస్ జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అభిజ్ఞ మెయిన్ లీడ్ పోషిస్తోంది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి. సినిమాల్లోకి రాక ముందు అభిజ్ఞ హైదరాబాద్, ఢిల్లీలో జుంబా ఇన్ స్ట్రక్టర్ గా చేసింది.

ఇవి కూడా చదవండి

విరాటపాలెం వెబ్ సిరీస్ లో అభీజ్ఞ

View this post on Instagram

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

2012లో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మారింది. ట్రావెల్ వ్లాగ్స్, జుంబా వీడియోలు, ఫిట్ నెస్‌, ఫ్యాషన్ టిప్స్ వీడియోలను అందులో షేర్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. డ్యాన్స్, ఫిట్ నెస్ కేటగిరీల్లో బెస్ట్ అంత్రప్రెన్యూర్ గా అవార్డులు కూడా అందుకుంది. ఇదే క్రమంలో రుహానీ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్ ఛాప్టర్-1 సినిమాతో పాటు లావణ్య త్రిపాఠి మిస్ పర్ ఫెక్ట్, గీతా సుబ్రమణ్యం 3 వంటి వెబ్ సిరీసుల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు విరాట పాలెం వెబ్ సిరీస్ తో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.