AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. టాలీవుడ్ హీరో అరెస్ట్

సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోన్న ఒక ప్రముఖ హీరోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హీరోలతో పాటు పలువురి రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. టాలీవుడ్ హీరో అరెస్ట్
Sriram Alias Srikanth
Basha Shek
|

Updated on: Jun 23, 2025 | 3:16 PM

Share

సినిమా ఇండస్ట్రీలో మరో సారి డ్రగ్స్ జాడలు బయట పట్టాయి. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తోన్న ఒక ఫేమస్ నటుడు డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం చెన్నైలోనే స్థిరపడిన ఆ హీరోను చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. అనంతరం అతని బ్లడ్ శాంపిల్స్ సేకరించి రిపోర్టుల కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏఐడీఎంకే మాజీ నేత నుంచి నటుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ పెడ్లర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హీరోను విచారిస్తున్నారు. విచారణలో భాగంగా మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇటీవల చెన్నైలోని నుంగంబాక్కంలో జరిగిన బార్ ఘర్షణ కేసుకు సంబంధించి AIADMK మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ అజయ్ వందయార్‌తో పాటు మరో 9 మందిని నుంగంబాక్కం పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే క్రమంలో AIADMK మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్‌ను  సెల్ ఫోన్ కాంటాక్ట్‌లను పరిశీలించినప్పుడు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతన్ మాదకద్రవ్యాల స్మగ్లర్‌తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.  అనంతరం ఇదే కేసుకు సంబంధించి సేలం లో ప్రదీప్ కుమార్ ను అరెస్ట్ చేశారు.  వీరి నుంచి 11 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్ కుమార్ 2023 నుంచి ప్రసాద్ కు కొకైన్ అమ్ముతున్నట్లు కూడా వెల్లడైంది. ఈ క్రమంలోనే హీరో కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? ఒకరికి ఒకరు సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించిన హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్.

తిరుపతికి చెందిన శ్రీకాంత్ ‘రోజా పూలు’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే కనిపించాడు. మధ్యలో తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో ఆకట్టుకున్నాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, దడ, నిప్పు,  సుప్రీమ్, రాగల 24 గంటల్లో, లై, శ్రీనివాస కల్యాణం, టెన్త్ క్లాస్ డైరీస్ తదితర సినిమాల్లో నటించాడు.

ఇవి కూడా చదవండి

నటుడు శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ ..

హీరో శ్రీరామ్ చివరిగా హరికథ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!