AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ప్లేయర్ల కంటే వీళ్లే నయం..రెండు నెలల్లో కోట్లు వెనకేస్తున్నారు.. ఐపీఎల్లో అంపైర్ల సంపాదన ఎంతో తెలుసా?

IPL 2026 : క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల సిక్సర్లు, బౌలర్ల వికెట్ల గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ, ఎండనక వాననక గంటల తరబడి నిలబడి ప్రతి బంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తీర్పునిచ్చే అంపైర్ల గురించి చాలా తక్కువగా చర్చిస్తుంటాం. ఒక చిన్న తప్పు జరిగితే విమర్శలు పాలయ్యే ఈ థాంక్ లెస్ జాబ్ వెనుక ఎంత ఆదాయం ఉంటుందో తెలుసా?

IPL 2026  : ప్లేయర్ల కంటే వీళ్లే నయం..రెండు నెలల్లో కోట్లు వెనకేస్తున్నారు.. ఐపీఎల్లో అంపైర్ల సంపాదన ఎంతో తెలుసా?
Ipl 2026
Rakesh
|

Updated on: Mar 19, 2026 | 10:23 AM

Share

IPL 2026 : ఐపీఎల్ అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ కేవలం ఆటగాళ్లే కాదు, అంపైర్లు కూడా భారీగానే వెనకేస్తున్నారు. సాధారణ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌తో పోలిస్తే ఐపీఎల్‌లో అంపైర్లకు రెట్టింపు కంటే ఎక్కువ ఫీజు లభిస్తుంది. గత సీజన్ వివరాల ప్రకారం.. ఫీల్డ్ అంపైర్లకు ఒక్కో మ్యాచ్‌కు ఏకంగా రూ.3 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇక నాలుగో అంపైర్ ఒక మ్యాచ్‌కు రూ.2 లక్షల వరకు అందుకుంటున్నారు. సగటున ఒక అంపైర్ సీజన్ మొత్తంలో 15 మ్యాచ్‌లు ఆడిస్తే, కేవలం రెండు నెలల్లోనే దాదాపు రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు సంపాదిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఐసీసీ జీతాల లెక్కలు

ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్లకు ఒక స్థిరమైన జీతం ఉంటుంది. నివేదికల ప్రకారం.. ఒక టెస్ట్ మ్యాచ్‌ ఆడిస్తే రూ.4 లక్షలు, వన్డేకు రూ.2.5 లక్షలు, టీ20కి రూ.1.25 లక్షల మేర ఫీజుగా ఇస్తారు. ఇది కాకుండా ప్రయాణ ఖర్చులు, బస, ఇతర సౌకర్యాలు అదనం. ఒక టాప్ అంపైర్ ఏడాదికి తన అసైన్‌మెంట్లను బట్టి రూ.75 లక్షల నుంచి రూ.1.7 కోట్ల వరకు సంపాదిస్తారు. ఎలైట్ ప్యానెల్‌లో లేని ఇతర అంతర్జాతీయ అంపైర్లకు ఈ మొత్తం కొంచెం తక్కువగా ఉంటుంది.

బీసీసీఐ డొమెస్టిక్ అంపైర్ల కేటగిరీలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన అంపైర్లను పనితీరు ఆధారంగా నాలుగు గ్రూపులుగా (A+, A, B, C) విభజించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 186 మంది అంపైర్లు ఉండగా, వీరిలో A+ గ్రూపులో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. వీరికి రోజుకు రూ.40,000 చెల్లిస్తారు. ఇక B, C గ్రూపు అంపైర్లకు రోజుకు రూ.30,000 ఫీజుగా లభిస్తుంది. ఒక సీజన్ మొత్తంలో డొమెస్టిక్ అంపైర్లు తమ మ్యాచ్‌లను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సంపాదిస్తారు. 2018 తర్వాత ఈ జీతాల నిర్మాణంలో పెద్దగా మార్పులు లేకపోయినా, ఇతర దేశాలతో పోలిస్తే భారత అంపైర్లకే ఆదాయం మెరుగ్గా ఉందని చెప్పాలి.

బాధ్యతతో కూడిన సంపాదన

అంపైర్లకు ఇంత భారీ మొత్తం చెల్లించడానికి కారణం లేకపోలేదు. మైదానంలో వారు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది. డీఆర్ఎస్ టెక్నాలజీ వచ్చాక వారిపై ఒత్తిడి మరింత పెరిగింది. ఆట సాఫీగా సాగేలా చూడటంతో పాటు, ప్లేయర్ల ప్రవర్తనను పర్యవేక్షించడం, మ్యాచ్ రిఫరీతో సమన్వయం చేసుకోవడం వంటి ఎన్నో బాధ్యతలు వీరిపై ఉంటాయి. అందుకే బీసీసీఐ, ఐసీసీ వారికి తగిన రీతిలో పారితోషికాన్ని అందిస్తున్నాయి. కేవలం ఆటగాళ్లకే కాదు, అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువతకు కూడా ఇదొక గొప్ప అవకాశం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అశ్విన్‌కు ఇచ్చిపడేసిన వైభవ్.. నాలో మరో యాంగిల్ చూస్తారంటూ షాక్..
అశ్విన్‌కు ఇచ్చిపడేసిన వైభవ్.. నాలో మరో యాంగిల్ చూస్తారంటూ షాక్..
ఖరీదైన ఆయిల్స్‌ వద్దు.. ఈ చిట్కాతో ఈజీగా హెయిర్ ఫాల్ తగ్గించండి
ఖరీదైన ఆయిల్స్‌ వద్దు.. ఈ చిట్కాతో ఈజీగా హెయిర్ ఫాల్ తగ్గించండి
మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..
మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..
సమ్మర్ లో కోడిగుడ్లు తినవచ్చా?నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
సమ్మర్ లో కోడిగుడ్లు తినవచ్చా?నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో లక్కీ హ్యాండ్
25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో లక్కీ హ్యాండ్
శరీరంలో వేడిని తగ్గించి శక్తిని ఇచ్చే పాతకాలం నాటి పానీయం..
శరీరంలో వేడిని తగ్గించి శక్తిని ఇచ్చే పాతకాలం నాటి పానీయం..
నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..