AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crocodile Viral Video: మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..

మనుషులు తుమ్మడం, జలుబు చేయడం మనకు కామనే. కానీ నీళ్లలో ఉండే ఒక భారీ మొసలి తుమ్మితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక క్రేజీ వీడియో తెగ వైరల్ అవుతోంది. నీటి బయట పడుకున్న ఒక మొసలి.. ముక్కు తిప్పుతూ, కళ్లు మూసుకుని, బాడీ మొత్తం వణకించి మరీ గట్టిగా ఒక తుమ్ము తుమ్మింది. ఆ సీన్ చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

Crocodile Viral Video: మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..
Can A Crocodile Sneeze
Krishna S
|

Updated on: Jun 02, 2026 | 1:04 PM

Share

మనుషులు తుమ్మడం మనకు తెలిసిన విషయమే. పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు తుమ్మినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, నీటిలో ఉండే భయంకరమైన మొసలి ఎప్పుడైనా తుమ్మడం చూశారా? అదేంటి.. మొసలి కూడా తుమ్ముతుందా? అని మీరు ముక్కున వేలేసుకోవచ్చు. కానీ ఇది అక్షరాలా నిజం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక భారీ మొసలి మనుషుల లాగే గట్టిగా తుమ్మిన పాత వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది. అది తుమ్మిన స్టైల్ చూస్తే మాత్రం మీరు నవ్వు ఆపుకోలేరు.

వీడియోలో ఏముంది?

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ క్రేజీ వీడియోలో.. ఒక భారీ మొసలి నీటి బయట ఒడ్డున ప్రశాంతంగా పడుకుని ఉంది. అంతలోనే దానికి ఏదో ఇబ్బంది మొదలైనట్టు అనిపిస్తుంది. అకస్మాత్తుగా దాని ముక్కు కదలడం స్టార్ట్ అయింది. మెల్లగా కళ్లు మూసుకుపోయి.. తుమ్ము వచ్చే ముందు మనుషుల లాగే దాని శరీరం మొత్తం ఒక్కసారిగా వణకడం మొదలైంది. అలా సుమారు 10 సెకన్ల పాటు బిల్డప్ ఇచ్చిన తర్వాత.. అది గట్టిగా, పెద్ద శబ్దంతో తుమ్మింది. ఆ భారీ జంతువు అలా తుమ్మిన దృశ్యం చాలా హాస్యంగా ఉండటంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

నెటిజన్ల కామెంట్ల వర్షం..

ఈ వింత వీడియో చూసిన నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. “మొసలి కూడా ఇంత రేంజ్‌లో తుమ్ముతుందా?” అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. “ఆ పది సెకన్ల పాటు అది ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి నాకు నవ్వు ఆగలేదు” అని మరికొందరు రాసుకొచ్చారు. ఇంకొందరైతే.. “మొసలికి పాపం ఏదో అలర్జీ ఉన్నట్టుంది”, “ఎవరైనా వెళ్లి ఆ మొసలికి ఒక టిష్యూ పేపర్ ఇవ్వండి” అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

అసలు మొసళ్లు ఎందుకు తుమ్ముతాయి?

ఈ వీడియో కేవలం వినోదం కోసమే కాదు.. ప్రకృతిలోని ఒక సరికొత్త వింతను మనకు చూపిస్తోందని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. మొసళ్లు కూడా మనుషుల లాగే తుమ్ముతాయి. వాటి ముక్కు రంధ్రాల్లోకి నీరు, దుమ్ము లేదా ఏవైనా చిన్న చిన్న రేణువులు చేరినప్పుడు వాటికి చికాకు పుట్టి తుమ్ము వస్తుంది. మొసళ్లకు చాలా బలమైన శరీరం ఉంటుంది కాబట్టి ఆ ఫోర్స్‌కు తుమ్మినప్పుడు వాటి బాడీ మొత్తం అలా షేక్ అవుతుంది. ఇలా తుమ్మడం వల్ల వాటి ముక్కు రంధ్రాలు లోపల క్లీన్ అవుతాయి. ముక్కులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్లే వాటి వేటాడే సామర్థ్యం పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తుందట.

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Jess (@sea.hrt)

Follow Us