AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీ రిలీజ్‌ల హంగామా.. నిజంగా ఆడియన్స్ వస్తున్నారా..?

రీ రిలీజ్‌ల హంగామా.. నిజంగా ఆడియన్స్ వస్తున్నారా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 01, 2026 | 1:39 PM

Share

కొత్త సినిమాల కొరత మధ్య టాలీవుడ్‌లో మళ్లీ రీ రిలీజ్‌ల హవా మొదలైంది. అతిథి, వన్ నేనొక్కడినే, భైరవద్వీపం, సమరసింహారెడ్డి, సూర్య సన్నాఫ్ కృష్ణణ్, ఈశ్వర్ వంటి చిత్రాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాహుబలి ఎపిక్ మినహా ఇటీవల రీ రిలీజ్‌లకు భారీ వసూళ్లు దక్కలేదు.

ఉన్నట్లుండి తెలుగు ఇండస్ట్రీలో రీ రిలీజ్‌లకు రెక్కలొచ్చాయి. కొత్త సినిమాలు ఎలాగూ లేవు కాబట్టి పాత సినిమాలతోనే థియేటర్స్ నింపడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. మరి అది ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారా లేదంటే ఏదో జస్ట్ లైక్ దట్ అన్నట్లు రీ రిలీజ్ చేస్తున్నారా..? పాత సినిమాలతో థియేటర్స్ నిజంగా నిండుతున్నాయా..? రీ రిలీజ్ సినిమాలకి రెండేళ్ల కింద ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. అందుకే ఆడియన్స్‌ని థియేటర్స్‌కు రప్పించడానికి.. కొత్త సినిమాలు లేని టైమ్‌లో పాత సినిమాలను తీసుకొస్తున్నారు. అతిథి 4K మే 29న విడుదలైంది. ఇక వన్ నేనొక్కడినే సినిమాను 4Kలోకి మార్చి మే 31న కృష్ణ జయంతికి రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్‌లలో మహేష్ ఎప్పుడూ ముందుంటారు. ఈ సీజన్ అంతా పాత సినిమాలతో నిండిపోనుంది. జూన్ 10న బాలయ్య బర్త్ డే కానుకంగా భైరవద్వీపంతో పాటు సమరసింహారెడ్డి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. వీటికోసం ప్రత్యేకంగా ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. గతేడాది భారీ హంగామా చేసి ఆదిత్య 369 సినిమాను 4Kలోకి మార్చి విడుదల చేసారు. ఈసారి ఈ రెండింటిని తీసుకొస్తున్నారు. జూన్ 12న సూర్య సన్నాఫ్ కృష్ణణ్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమాను రెండుసార్లు రీ రిలీజ్ చేసారు. ఆ మరుసటి రోజు ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ సినిమా మళ్లీ రిలీజ్ కానుంది. నిజంగా రీ రిలీజ్‌లకు రెస్పాన్స్ బాగుందా అంటే సమాధానం చెప్పడం కాస్త కష్టమే. 2026లో 15 సినిమాలు రీ రిలీజ్ చేస్తే.. డార్లింగ్ ఒక్కటే కాస్త కాసులు కురిపించింది. నిజం చెప్పాలంటే కొన్నేళ్లుగా ఎంత హడావిడి చేసి రీ రిలీజ్ చేసినా కూడా కలెక్షన్లు మాత్రం అంతగా రావట్లేదు. మనసంతా నువ్వే, జగదేకవీరుడు అతిలోకసుందరి, లవ్ స్టోరీ లాంటి సినిమాలు పెద్దగా సందడి చేయలేదు. ఈ మధ్య కాలంలో బాహుబలి ఎపిక్ ఒక్కటే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రీ రిలీజ్‌లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి

ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!

అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’

Follow Us