AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరిక్షంలో 'రమ్'వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Phani CH
|

Updated on: Jun 01, 2026 | 12:07 PM

Share

పాలపుంత గెలాక్సీ కేంద్రంలో ఉన్న సగిటారియస్ బీ2 అనే అణు మేఘంలో రాస్ప్‌బెర్రీ పండ్ల రుచి, రమ్ సువాసనకు కారణమయ్యే ఇథైల్ ఫార్మేట్ రసాయనం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ మేఘం జీవం పుట్టుకకు అవసరమైన సంక్లిష్ట కర్బన అణువుల ఉనికిపై కీలక ఆధారాలను అందిస్తోంది.

అంతరిక్షం అంటే కేవలం శూన్యం, నక్షత్రాలు మాత్రమే కాదు.. అక్కడ మనకు ఊహకందని వింతలు మరెన్నో ఉన్నాయి. తాజాగా మన పాలపుంత కేంద్రంలో రాస్ప్‌బెర్రీ పండ్ల రుచి, రమ్ సువాసనలతో కూడిన ఒక భారీ వింత మేఘం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజమని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. భూమికి సుమారు 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న “సగిటారియస్ బీ2” అనే అణు మేఘంలో ఈ అద్భుతాన్ని కనుగొన్నారు. నక్షత్రాలు పుట్టే ఈ ప్రాంతం దాదాపు 150 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. స్పెయిన్‌లోని రేడియో టెలిస్కోప్ ద్వారా జరిపిన పరిశోధనల్లో.. ఈ మేఘంలో “ఇథైల్ ఫార్మేట్” అనే రసాయన సమ్మేళనం ఉన్నట్లు తేలింది. భూమిపై రాస్ప్‌బెర్రీ పండ్లకు ప్రత్యేకమైన రుచిని, రమ్‌కు ఆ సువాసనను ఇచ్చేది ఈ రసాయనమే కావడం విశేషం. అయితే, ఈ మేఘం సువాసనలు వెదజల్లుతున్నప్పటికీ ఇది అత్యంత ప్రాణాంతకమైనది. ఇందులో ఇథనాల్, మిథనాల్‌తో పాటు తీవ్రమైన విషవాయువులైన హైడ్రోజన్ సైనైడ్, కార్బన్ మోనాక్సైడ్ కూడా నిండి ఉన్నాయి. పైగా అక్కడ శూన్య వాతావరణం, విపరీతమైన చలి ఉండటం వల్ల దీనిని నేరుగా రుచి చూడటం అసాధ్యం. అంతరిక్షంలో కూడా జీవం పుట్టుకకు అవసరమైన సంక్లిష్ట కర్బన అణువులు ఏర్పడతాయని ఈ ఆవిష్కరణ నిరూపించింది. ప్రస్తుతం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ వింత మేఘంపై మరిన్ని పరిశోధనలు సాగుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’

ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్‌!

విమానం నుంచి చూస్తే ‘భారత్-పాక్’ సరిహద్దు ఎలా ఉందో తెలుసా?

రూ.1.1 లక్షల కోట్లు.. ఈ డబ్బుకు వారసులెవరు?

లక్షలు ఖర్చు పెట్టే ఏసీ ఎందుకు..? కూలర్‌ అనే బెస్ట్ ఆప్షన్ ఉండగా అంటున్న నిపుణులు

Follow Us