AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి '6-6-6 వాకింగ్ టెక్నిక్'

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’

Phani CH
|

Updated on: Jun 01, 2026 | 12:05 PM

Share

ప్రస్తుతం ఫిట్‌నెస్ ప్రపంచంలో ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’ ట్రెండ్ అవుతోంది. 6 నిమిషాల వార్మప్, గంటసేపు వేగంగా నడక, చివరగా 6 నిమిషాల కూల్‌డౌన్‌తో కూడిన ఈ విధానం బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం 6 గంటల సమయంలో ఈ నడక చేయడం వల్ల శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

ఆరోగ్యంగా ఉండటానికి, గుండె పనితీరును మెరుగుపరుచుకోవడానికి నడకను మించిన ఉత్తమ వ్యాయామం లేదు. రోజూ సాధారణంగా నడిచే నడక కంటే, ఒక పద్ధతి ప్రకారం నడిస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో, హెల్త్ సర్కిల్స్‌లో ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’ బాగా ట్రెండ్ అవుతోంది. శరీరంలో ఎక్కువ క్యాలరీలు కరిగించి, సులభంగా బరువు తగ్గడానికి ఈ సరికొత్త పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు ఈ ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’ అంటే ఏంటి? దీనివల్ల కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ‘6-6-6 వాకింగ్’ అంటే ఏంటి? ఈ వ్యాయామ విధానం మొత్తం 3 దశలుగా సాగుతుంది. నడకకు ముందు శరీరాన్ని సిద్ధం చేయడం , వేగంగా నడవడం , ఆ తర్వాత శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం అనే శాస్త్రీయ పద్ధతిపై ఇది పనిచేస్తుంది. మొదటి 6 నిమిషాలు వార్మప్ కోసం చాలా నెమ్మదిగా, సాధారణ వేగంతో నడవాలి. ఇది నిద్రలో లేదా విశ్రాంతిలో ఉన్న మీ శరీర కండరాలను నడకకు సిద్ధం చేస్తుంది. వార్మప్ పూర్తయిన తర్వాత మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి లేదా మీ డాక్టర్ సలహా మేరకు దాదాపు గంట సేపు.. బ్రిస్క్ వాకింగ్… అంటే వేగంగా నడవాలి. ఈ దశలోనే మీ గుండె వేగం పెరిగి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. గంట సేపు వేగంగా నడిచిన తర్వాత, ఒక్కసారిగా ఆగిపోకూడదు. చివరి 6 నిమిషాల పాటు నడక వేగాన్ని పూర్తిగా తగ్గించి, రిలాక్స్‌గా నడవాలి. ఇది పెరిగిన గుండె వేగాన్ని, రక్తపోటును మళ్లీ సాధారణ స్థితికి తెస్తుంది. ఈ టెక్నిక్ పూర్తి ప్రయోజనాలు దక్కాలంటే సమయం కూడా ముఖ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం ఉదయం 6 గంటలు లేదా సాయంత్రం 6 గంటల సమయాన్ని ఎంచుకోవాలి. ఎందుకు అంటే.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో నడవడం వల్ల ప్రకృతి నుండి స్వచ్ఛమైన గాలి, తగినంత విటమిన్-డి లభిస్తాయి. ఇది శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఈ టెక్నిక్ వల్ల వేగంగా బరువు తగ్గుతారు. శరీరంలో మెటబాలిజం పెరిగి, కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండానే సులభంగా బరువు తగ్గుతారు. నడక వేగంలో క్రమబద్ధమైన మార్పులు ఉండటం వల్ల గుండె సామర్థ్యం మెరుగవుతుంది. రక్తప్రసరణ బాగా సాగుతుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నడవడం వల్ల ఒత్తిడిని కలిగించే ‘కార్టిసాల్’ హార్మోన్ స్థాయిలు తగ్గి, మానసిక ఉల్లాసం కలుగుతుంది. నడకకు ముందు వార్మప్, తర్వాత కూల్‌డౌన్ చేయడం వల్ల కండరాలు పట్టేయడం, మరుసటి రోజు ఒంటి నొప్పులు రావడం వంటి సమస్యలు రావు. వాకింగ్ అలవాటు లేని వారు మొదటి రోజే గంట సేపు వేగంగా నడిస్తే త్వరగా అలసిపోతారు. కాబట్టి మొదటి వారం రోజులు మీ శరీర సహకారాన్ని బట్టి నడక సమయాన్ని, వేగాన్ని నెమ్మదిగా పెంచాలి. వాకింగ్‌కు వెళ్లేటప్పుడు కాళ్లకు నొప్పులు రాకుండా ఉండటానికి మంచి గ్రిప్ ఉన్న స్పోర్ట్స్ షూ వేసుకోవాలి. సమయాన్ని ట్రాక్ చేయడానికి వీలుగా స్మార్ట్ వాచ్ లేదా మొబైల్ టైమర్ పెట్టుకోవడం మంచిది. నడకకు ముందు, నడిచేటప్పుడు, నడక ముగిసిన తర్వాత తగినన్ని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ వాకింగ్ ట్రెండ్ ను అనుసరించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్‌!

విమానం నుంచి చూస్తే ‘భారత్-పాక్’ సరిహద్దు ఎలా ఉందో తెలుసా?

రూ.1.1 లక్షల కోట్లు.. ఈ డబ్బుకు వారసులెవరు?

లక్షలు ఖర్చు పెట్టే ఏసీ ఎందుకు..? కూలర్‌ అనే బెస్ట్ ఆప్షన్ ఉండగా అంటున్న నిపుణులు

తినడం రాంగ్ టైమ్ లో.. పడుకోవడం రాంగ్ టైమ్ లో.. దెబ్బతింటున్నపేగు ఆరోగ్యం

Follow Us