తినడం రాంగ్ టైమ్ లో.. పడుకోవడం రాంగ్ టైమ్ లో.. దెబ్బతింటున్నపేగు ఆరోగ్యం
తప్పు సమయంలో భోజనం చేయడం, నీళ్లు తక్కువగా తాగడం, ఫైబర్ ఆహారం తీసుకోకపోవడం వంటి రోజువారీ అలవాట్లు పేగుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ప్రముఖ కొలొరెక్టల్ సర్జన్ డాక్టర్ పరమేశ్వర హెచ్చరించారు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, ఐబీఎస్ వంటి సమస్యలకు ఈ అలవాట్లే ప్రధాన కారణమని పేర్కొంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
సాధారణంగా భారతీయులు రాంగ్ టైమ్ లో తింటారు, రాంగ్ టైమ్ లో నిద్రపోతారు, నీళ్లు తప్ప మిగతావన్నీ తాగుతారు. అదేమిటని అడిగితే డైలీ రొటీన్ అంటారు అంటూ బెంగళూరుకు చెందిన ప్రముఖ కొలొరెక్టల్ సర్జన్ డాక్టర్ పరమేశ్వర సంచలన కామెంట్లు చేశారు.పేగు సంబంధిత చికత్సలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన, ఆధునిక జీవనశైలి పేగుల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. ప్రస్తుత బిజీ జీవితంలో చాలామంది చేసే 6 ప్రధాన తప్పుల వల్ల పేగు సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ తెలిపిన 6 హానికర అలవాట్లు ఏంటంటే.. రాత్రి 9 తర్వాత భోజనం చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణంకాక, పులిసిపోతుంది. దీనివల్ల గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయకపోవడం, కొన్నిసార్లు భోజనం మానేయడం వల్ల పేగుల పనితీరు దెబ్బతిని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు వస్తాయి. రోజూ బిస్కెట్లు, చిప్స్, నూడుల్స్ వంటి ప్యాకెట్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. నాల్గవది చాలామందిలో మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలకు శరీరంలో నీటిశాతం తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. మైదా, తెల్ల అన్నం ఎక్కువగా తీసుకుని, ఫైబర్ ఉన్న కూరగాయలు, పండ్లు తినకపోవడం వల్ల వ్యర్థాలు పేగులలొ పేరుకుపోతాయనీ డాక్టర్ పరమేశ్వర తెలిపారు. నిద్రలేమి వల్ల పేగులలో వాపు పెరిగి, అసిడిటీ వంటి సమస్యలు తీవ్రమవుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ చిన్న చిన్న మంచి అలవాట్లు అలవర్చుకోవాలని డాక్టర్ పరమేశ్వర సూచించారు. రాత్రి 9 లోపు భోజనం చేయడం, రోజూ తగినంత నీరు తాగడం, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటివి పేగుల ఆరోగ్యానికి చాలా కీలకమని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా ‘లాస్ట్ పెగ్’ వేసి
Jio: జియో బంపర్ ఆఫర్..కేవలం రూ.200కే అన్నీ..!
ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి
దుర్గమ్మ భక్తులకు అలర్ట్..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత!
వడదెబ్బ ధాటికి ఒక్కరోజే 23 మంది బలి..ఏపీలో పిడుగులతో కూడిన వర్షం
మన ఆర్థికవ్యవస్థకు..3 భయంకరమైన సవాళ్లు.. ఏమిటవి?
అనాథాశ్రమంలో ఉండే యువతులతో పెళ్లంటే ఎగిరి గంతేసిన యువకులు
బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా 'లాస్ట్ పెగ్' వేసి
ఉద్యోగం పోయిందని సంబరాలు..
మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

