AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఏడేళ్ల నివాసంతోనే గ్రీన్ కార్డ్!

భారతీయులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఏడేళ్ల నివాసంతోనే గ్రీన్ కార్డ్!

Phani CH
|

Updated on: Jul 30, 2026 | 3:39 PM

Share

అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించేలా అమెరికా సెనేట్‌లో కొత్త బిల్లు ప్రవేశించింది. ఏడేళ్లుగా అమెరికాలో నివసిస్తూ నేరచరిత్ర లేని వలసదారులకు గ్రీన్ కార్డ్ మార్గాన్ని సులభతరం చేయడమే దీని లక్ష్యం. బిల్లు చట్టమైతే లక్షలాది భారతీయ నిపుణులు, వారి కుటుంబాలకు దీర్ఘకాల నిరీక్షణ నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

అమెరికాలో శాశ్వత నివాసం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులకు భారీ ఊరట లభించే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా సెనేట్‌లో ‘రిన్యూయింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929’ పేరుతో కాలిఫోర్నియా డెమొక్రటిక్ సెనేటర్ అలెక్స్ పడిల్లా కొత్త బిల్లును పునఃప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే, గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న లక్షలాది మంది హెచ్-1బీ వీసాదారుల నిరీక్షణకు తెరపడనుంది. ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 249 ‘రిజిస్ట్రీ’ నిబంధనను సవరించడమే. ప్రస్తుతం ఉన్న పాత చట్టం ప్రకారం 1972 జనవరి 1 కంటే ముందు అమెరికాలోకి ప్రవేశించిన వారికి మాత్రమే ఈ నిబంధన కింద గ్రీన్ కార్డ్ పొందే అర్హత ఉంది. గత 50 ఏళ్లుగా ఈ తేదీ మారకపోవడంతో ఇది దాదాపు నిరుపయోగంగా మారింది. తాజా ప్రతిపాదన ప్రకారం ఈ పాత తేదీని తొలగించి, దరఖాస్తు చేసేనాటికి వరుసగా ఏడేళ్లు అమెరికాలో నివసిస్తూ, ఎలాంటి నేరచరిత్ర లేని అర్హులైన వలసదారులందరికీ గ్రీన్ కార్డ్ మంజూరు చేస్తారు. ప్రస్తుతం ఉన్న 7 శాతం దేశాల వారీ పరిమితి వల్ల అత్యధికంగా నష్టపోతోంది భారతీయులే. దాంతో భారతీయ నిపుణులు, వారి కుటుంబాలు దశాబ్దాల తరబడి తాత్కాలిక వీసాలపైనే గడపాల్సి వస్తోంది. ఈ కొత్త బిల్లు ఆమోదం పొందితే హెచ్-1బీ ఉద్యోగులు, వారి పిల్లలు, డ్రీమర్స్, టీపీఎస్ లబ్ధిదారులకు గ్రీన్ కార్డ్ పొందేందుకు సులువైన ప్రత్యామ్నాయ మార్గం సుగమమవుతుంది. ఇది వలసదారులలో ఉద్యోగ భద్రతను పెంచి, పదేపదే వీసా పొడిగింపులు చేయించే తిప్పల నుంచి విముక్తి కలిగిస్తుంది. అయితే ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చాలంటే అమెరికా సెనేట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ ఆమోదం పొంది, అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బిల్లుకు సెనేట్ డెమొక్రటిక్ విప్ డిక్ డర్బిన్ సహా పలువురు సెనేటర్లు, 30కి పైగా సంస్థలు బలమైన మద్దతును అందిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!

మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!

Follow Us