Jio: జియో బంపర్ ఆఫర్..కేవలం రూ.200కే అన్నీ..!
రిలయన్స్ జియో రూ.200 ధరతో కొత్త ‘జియో ఓటీటీ పాస్’ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా 15 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పాటు 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లను వీక్షించే అవకాశం లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ, 30 జీబీ డేటా, అపరిమిత 5జీ డేటాతో కూడిన ఈ ప్యాక్ వినోద ప్రియులను ఆకట్టుకుంటోంది.
దేశీయ ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినోద ప్రియుల కోసం సరికొత్త సంచలన ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 200 ధరతో “జియో ఓటీటీ పాస్” పేరుతో ఒకే ప్యాక్‌లో కళ్ళు చెదిరే ప్రయోజనాలను ప్రకటించింది. ఈ సరికొత్త ప్యాక్ ద్వారా వినియోగదారులు 15 ప్రముఖ ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పాటు, 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. సుమారు రూ. 1,500 విలువైన ఈ సేవలను జియో అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఈ ప్యాక్‌లో యూట్యూబ్ ప్రీమియం , జియోహాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. వీటితో పాటు సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, సన్ నెక్స్ట్ వంటి మరో 12 ఓటీటీల కంటెంట్‌ను జియోటీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు. అంతేకాకుండా, స్టార్ ప్లస్, కలర్స్, సన్ టీవీ వంటి 150 కి పైగా పెయిడ్ ఛానెళ్లతో కలిపి మొత్తం 1,000 లైవ్ టీవీ ఛానెళ్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. కనెక్టివిటీ పరంగా ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న ఏ జియో కస్టమరైనా మైజియో యాప్ లేదా జియో వెబ్‌సైట్ ద్వారా ఈ సూపర్ ఓటీటీ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి
మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు!
మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే
పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’.. ఊరందరికీ రూ.33.6 కోట్ల బీమా కానుక
బార్లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా 'లాస్ట్ పెగ్' వేసి
ఉద్యోగం పోయిందని సంబరాలు..
మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే
పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’..
‘ఇండియన్స్ అంటే.. అక్కడ కూలీలే
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ
అద్భుతం.. చైనాలో డాక్టర్లు.. హైదరాబాద్‌లో సర్జరీ..

